Homeటాప్ స్టోరీస్RRR అదిరిపోయిన ఫస్ట్ గ్లింప్స్..!

RRR అదిరిపోయిన ఫస్ట్ గ్లింప్స్..!

RRR First Glimpse Released

బాహుబలి తర్వాత రాజమౌళి సృష్టిస్తున్న అద్భుత సృష్టి ఆర్.ఆర్.ఆర్. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ కలిసి నటిస్తున్న ఈ మెగా మల్టీస్టారర్ సినిమా నుండి ఇప్పటికే ఇద్దరి హీరోల పాత్రలను పరిచయం చేస్తూ టీజర్లు రాగా లేటెస్ట్ గా సినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. 45 సెకన్ల పాటు ఒక్క డైలాగ్ కూడా లేకుండా మొత్తం విజువల్ గ్రాండియర్ గా ఆర్.ఆర్.ఆర్ ఫస్ట్ గ్లింప్స్ వచ్చింది.

- Advertisement -

సినిమాలో కొమరం భీం, అల్లూరి పాత్రదారులు ఎన్.టి.ఆర్, చరణ్ ఇద్దరు తమ నట విశ్వరూపం చూపించినట్టు ఉన్నారు. గ్లింప్స్ లో అజయ్ దేవగ, అలియా భట్ లను చూపించారు. తెలుగు ప్రేక్షకులకే కాదు ఇండియన్ ఆడియెన్స్ కు మరో అద్భుతమైన విజువల్ ట్రీట్ ఇచ్చేలా ఆర్.ఆర్.ఆర్ రెడీ అవుతుందని తెలుస్తుంది. ఇక 45 సెకన్ల టీజర్ తోనే తారాస్థాయిలో అంచనాలు పెంచేసిన రాజమౌళి ఇక ట్రైలర్ తో సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేస్తాడని చెప్పొచ్చు.

ఎన్.టి.ఆర్, రాం చరణ్ మాత్రమే కాదు అజయ్ దేవగన్ కూడా సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఇక సినిమాకు కీరవాణి మ్యూజిక్ మరో స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. మొత్తానికి రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ తో మరో సంచలనానికి సిద్ధమయ్యాడని చెప్పొచ్చు.

 

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All