
యావత్ సినీ లోకం ఎదురుచూస్తున్న ఎదురుచూపులు తెరపడింది. ఆర్ఆర్ఆర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. గురువారం అర్ధరాత్రి నుండే షోస్ మొదలవ్వడం తో సోషల్ మీడియా లో ఆర్ఆర్ఆర్ ట్రేడ్ నడుస్తుంది. అభిమానులు , సినీ ప్రముఖులు , సామాన్య ప్రేక్షకులు ఇలా అంత కూడా సినిమాను చూసేందుకు పోటీ పడుతున్నారు. ఇక ఓవర్సీస్ లో ఆర్ఆర్ఆర్ కలెక్షన్స్ గత రికార్డ్స్ ను బ్రేక్ చేసింది.
ప్రీమియర్స్ ద్వారానే దాదాపు 3 మిలియన్ డాలర్లకు పైగానే వసూలు చేసిన ఈ సినిమా.. మొదటి రోజు కూడా అదిరిపోయే స్పందనను సొంతం చేసుకుంది. ఫలితంగా ఒక మిలియన్ డాలర్లకు పైగానే కలెక్షన్లను రాబట్టింది. దీంతో మొత్తంగా ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ ప్లస్ ఫస్ట్ డే కలుపుకుని 5 మిలియన్ డాలర్ల మార్కును అందుకుంది. భారత కరెన్సీ ప్రకారం..రూ. 41 కోట్ల గ్రాస్ రాబట్టిందన్నమాట. ఇది ఇండియన్ సినీ చరిత్రలోనే టాప్ కలెక్షన్స్ అని తెలుస్తోంది. రాజమౌళి డైరెక్ట్ చేసిన గత చిత్రం బహుబలి ఓవర్సీస్ లో రూ. 29 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది.