
ఆర్ఆర్ఆర్ సినిమా కోసం యావత్ సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తమ అభిమాన నటులు ఎన్టీఆర్ , చరణ్ కలిసి నటిస్తుండడం , రాజమౌళి డైరెక్ట్ చేయడం తో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇక ఈ మధ్య తమ అభిమానాన్ని అభిమానులు స్క్రీన్ ముందుకు కనపరుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. హీరో ఎంట్రీ అవుతుంటే స్క్రీన్ ముందు కాగితాలు విసరడం , ఎగరడం వంటివి చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ కు మాత్రం థియేటర్స్ యాజమాన్యం షాక్ ఇచ్చారు.
శ్రీకాకుళంలో సూర్య మహల్ అనే ఒక థియేటర్ యాజమాన్యం అభిమానులు స్క్రీన్ ముందు ఏమాత్రం ఎగరకుండా ముందుగానే ఫెన్సింగ్ వేసి ఉంచారు. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. మరోపక్క రామ్ చరణ్, ఎన్టీఆర్ అభిమానులు పోటాపోటీ హడావుడిని తట్టుకోవడం
థియేటర్ యాజమాన్యానికి పెద్ద టాస్క్ గా మారింది. థియేటర్స్ ముందు అయితే ఎలాంటి కొట్లాటలు జరగకుండా ముందుగానే ప్రత్యేకమైన సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ప్రత్యేకమైన బ్యానర్ లు కూడా వివాదాలకు తావు ఇవ్వకుండా ఉండాలి అని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.