
దేశ వ్యాప్తంగా ఎదురుచూస్తున్న చిత్రం `ఆర్ ఆర్ ఆర్`. `బాహుబలి` వంటి సంచలన చిత్రం తరువాత రాజమౌళి నుంచి వస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై సర్వత్రా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తీసిపోయి స్థాయిలో ఈ చిత్రాన్ని జక్కన్న తెరకెక్కిస్తున్నారు. చిత్రీకరణ ఫుల్ స్వీంగ్‌లో జరుగుతోంది. రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్నారు. తొలిసారి ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో రాజమౌళి ఏ విషయంలోనూ రాజీపడటం లేదు.
టాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్‌తో పాటు బాలీవుడ్, హాలీవుడ్ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి
సంబంధించి రోజుకో అప్‌డేట్ బయటికి వచ్చేస్తోంది. అయినా రాజమౌళి టెన్షన్ పడటం లేదు. కథ చెప్పేశాను. ఎలా చూపించబోతున్నాను అన్నదే ఇక్కడ ప్రధానం. ఆ విషయంలో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తే సినిమా బ్లాక్ బస్టరే. ఈ సూత్రాన్ని `మర్యాద రామన్న` సినిమా నుంచి పాటిస్తూ వస్తున్న రాజమౌళి `ఆర్ ఆర్ ఆర్`కు కూడా ఇదే ఫార్ములాని వాడేస్తున్నాడు.
ముందు ఈ చిత్రాన్ని ఈ ఏడాది జూలై 30న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఆ తరువాత అది మారే అవకాశం వుందని ప్రచారం జరిగింది. అయితే విడుదల తేదీపై చిత్ర బృందం ఎలాంటి స్పష్టతని ఇవ్వలేదు. తాజాగా నిర్మాత డీవీవీ దానయ్య కొత్తగా రిలీజ్ డేట్‌ని ప్రకటించి షాకిచ్చారు. వచ్చే ఏడాది జనవరి 8న `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ చేయబోతున్నామని ప్రకటించారు. ఇన్ని రోజులు ఎదురుచూడాలంటే కష్టమే కానీ తప్పదు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ అప్‌డేట్‌ని ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటాను` అని వెల్లడించడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
`బాహుబలి`కి మించి ఈ చిత్రం కోసం గ్రాఫిక్స్ వర్క్ చేయించబోతున్నారట. కొత్త ప్రపంచాన్ని సరికొత్తగా చూపించబోతున్నారట. అందు కోసం ఎక్కువ సమయం అవసరం. దాన్ని దృష్టిలో పెట్టుకుని రిలీజ్ డేట్‌ని వచ్చే ఏడాది జనవరికి మార్చారని ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.