Homeటాప్ స్టోరీస్తెలుగు రాష్ట్రాల వారం కలెక్షన్లతో ఆర్ఆర్ఆర్ కు పెట్టిన మొత్తం ఖర్చు వచ్చేస్తుందా..?

తెలుగు రాష్ట్రాల వారం కలెక్షన్లతో ఆర్ఆర్ఆర్ కు పెట్టిన మొత్తం ఖర్చు వచ్చేస్తుందా..?

RRR COllections telugu states
RRR COllections telugu states

దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. మార్చి 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో కలెక్షన్ల గురించి అంత మాట్లాడుకుంటున్నారు.సినిమా ఫై భారీ అంచనాలు నెలకొని ఉండడం తో ఫస్ట్ డే రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయమంటున్నారు. ఫస్ట్ డే ఈజీ గా దేశ వ్యాప్తంగా రూ. 200 కోట్లు రాబట్టడం ఖాయం అంటున్నారు. మరోపక్క తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలను భారీగా పెంచుకునే అవకాశం రెండు ప్రభుత్వాలు ఇవ్వడం తో చిత్ర మేకర్స్ పండగ చేసుకుంటున్నారు.

ఇక ఈ పెంచిన టికెట్ ధరలతో వారం రోజుల్లో ఆర్ఆర్ఆర్ కు పెట్టిన మొత్తం వచ్చేస్తుందని అంత లెక్కలేసుకుంటున్నారు. ఒక రోజులో రెండు తెలుగు రాష్ట్రాల కలెక్షన్లు రూ.40 నుంచి రూ.50 మధ్య ఖాయంగా ఉంటుందంటున్నారు. అంటే.. వారం పాటు హౌస్ ఫుల్ గా ఆడితే ఏకంగా రూ.300 కోట్ల కలెక్షన్లు దాటిపోతాయని.. ఈ లెక్కన.. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం సాధించే వసూళ్లతోనే సినిమా బడ్జెట్ మొత్తం తిరిగి వస్తుందని చెబుతున్నారు. ఇక మిగతా రాష్ట్రాల్లో వచ్చే కలెక్షన్లతో ఈ సినిమా మొదటి వారంలోనే రికార్డు వసూళ్లు రావటం ఖాయమంటున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts