Homeటాప్ స్టోరీస్ఆర్ఆర్ఆర్ సెన్సార్ టాక్..

ఆర్ఆర్ఆర్ సెన్సార్ టాక్..

RRR censor details
RRR censor details

దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. మార్చి 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో చిత్ర యూనిట్ సెన్సార్ కార్య క్రమాలు పూర్తి చేసింది. సినిమా చూసిన సెన్సార్ అధికారులు సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసారు. అలాగే సినిమా ర‌న్ టైం 3 గంట‌ల 6 నిమిషాలు గా తేల్చారు.

ఇక ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మార్చి 19న చిక్కబల్లాపూర్‌లో భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా కర్ణాటక సీఎం వస్తాడని ప్రచారం జరుగుతుండగా..తాజాగా మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలు సైతం హాజరుకాబోతోన్నారని సమాచారం అందుతుంది. ఇదే నిజమైతే అభిమానులకు ఇంతకన్నా మరో పండగ లేదు. ఇక ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్.. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తుండగా.. అలియా భట్ , సముద్రఖని , అజయ్ దేవగన్ , శ్రీయ మొదలగువారు పలు పాత్రల్లో కనిపిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All