Homeటాప్ స్టోరీస్ఎత్తర జెండా అంటూ ఆర్ఆర్ఆర్ నుండి క్రేజీ అప్డేట్

ఎత్తర జెండా అంటూ ఆర్ఆర్ఆర్ నుండి క్రేజీ అప్డేట్

RRR Celebration Anthem from Marchi 14th
RRR Celebration Anthem from Marchi 14th

యావత్ సినీ అభిమానులంతో ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోన్న మూవీ “ఆర్‌ఆర్‌ఆర్‌(రౌద్రం రణం రుధిరం)”. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 25 న భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. తెలుగు తో పాటు దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని భాషలతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్ ను మొదలుపెట్టారు మేకర్స్.

ఇందులో భాగంగా..‘‘ట్రిపుల్ ఆర్ సర్‌ప్రైజింగ్ యాంథ‌మ్‌ను మార్చి 14న విడుద‌ల చేయ‌బోతున్నాం. నిజానికి ఈ సెల‌బ్రేష‌న్ యాంథ‌మ్‌తో ట్రిపుర్ సినిమా చివ‌ర‌లో ఉంచి.. ప్రేక్ష‌కుల‌ను స‌ర్‌ప్రైజ్ చేయాల‌ని భావించాం. కానీ ఎగ్జ‌యిట్‌మెంట్‌ను ఆపుకోలేక‌పోతున్నాం’’ అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు. ఎత్తర జెండా అంటూ సాగే ఈ ట్రిపుల్ ఆర్ సెలబ్రెషన్ యాంథమ్ మార్చి 14న రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్.. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నాడు.

- Advertisement -

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts