Homeటాప్ స్టోరీస్ఆర్ఆర్ఆర్ నాల్గో రోజు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్

ఆర్ఆర్ఆర్ నాల్గో రోజు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్

RRR 4th day telugu states collections
RRR 4th day telugu states collections

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా చేసిన చిత్రం ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం). సుమారు 450 కోట్ల భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు మొదటి ఆటతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని , బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతుంది. కీరవాణి సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన రామ్ చరణ్ సరసన ఆలియా భట్, కొమురం భీం పాత్రలో నటించిన ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ హీరోయిన్లు నటించారు.

ఇక నాల్గో రోజు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ చూస్తే..

- Advertisement -

నైజాంలో రూ. 8.15 కోట్లు
సీడెడ్‌లో రూ. 2.9 కోట్లు
ఉత్తరాంధ్రలో రూ. 2.36 కోట్లు
ఈస్ట్‌లో రూ. 0.95 కోట్లు
వెస్ట్‌లో రూ. 0.97 కోట్లు
గుంటూరులో రూ. 0.67 కోట్లు
కృష్ణాలో రూ. 1.05 కోట్లు
నెల్లూరులో రూ.6 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 17.55 కోట్లు షేర్ రాబట్టింది.

మొత్తం నాల్గు రోజుల్లో చూస్తే..

నైజాంలో రూ. 61.65 కోట్లు
సీడెడ్‌లో రూ. 31.8 కోట్లు
ఉత్తరాంధ్రలో రూ. 17.9 కోట్లు
ఈస్ట్‌లో రూ. 9.64 కోట్లు
వెస్ట్‌లో రూ. 8.95 కోట్లు
గుంటూరులో రూ. 12.23 కోట్లు
కృష్ణాలో రూ. 8.15 కోట్లు
నెల్లూరులో రూ. 4.88 కోట్లతో కలుపుకుని రూ. 156.64 కోట్లు షేర్ వసూళ్లు సాధించింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All