
యావత్ సినీ లోకం ఎదురుచూస్తున్న ఎదురుచూపులు తెరపడింది. ఆర్ఆర్ఆర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. నిన్న గురువారం అర్ధరాత్రి నుండే షోస్ మొదలవ్వడం తో సోషల్ మీడియా లో ఆర్ఆర్ఆర్ ట్రేడ్ నడుస్తుంది. అభిమానులు , సినీ ప్రముఖులు , సామాన్య ప్రేక్షకులు మాత్రమే కాదు రాజకీయ నేతలు సైతం సినిమా ఫై ట్వీట్స్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ ని త్రీడీ ఫార్మాట్లో కూడా రిలీజ్ చేయడం జరిగింది.
ఈ ఫార్మాట్లో చూసిన కొంత మంది ప్రేక్షకులు ఏమాత్రం పాజిటివ్ గా స్పందించడం లేదు. 3Dలో చూడడం కంటే 2Dలో నార్మల్గా చూడడమే బెటర్ అని అంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే పెద్దగా త్రీడిలో సినిమాను విడుదల చేయలేదు. ముఖ్యంగా హైదరాబాద్లో ఆన్లైన్లో ఒకే ఒక్క థియేటర్ కు సంబంధించిన టికెట్లు అమ్మకానికి పెట్టడం విశేషం. ఏదేమైనా రాజమౌళి మాత్రం 3డీ ఫార్మాట్లో అనుకున్నంతగా మెప్పించలేకపోయాడు అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.