Homeటాప్ స్టోరీస్33 రోజుల్లో ఆర్ఆర్ఆర్ ఎంత కలెక్ట్ చేసిందంటే

33 రోజుల్లో ఆర్ఆర్ఆర్ ఎంత కలెక్ట్ చేసిందంటే

RRR 17th day collections
RRR 17th day collections

ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలై నెల రోజులు పూర్తి చేసుకున్నప్పటికీ ..బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం కలెక్షన్ల జోరు కొనసాగుతూనే ఉంది. నందమూరి ఎన్టీఆర్, మెగా హీరో రామ్ చరణ్ కాంబినేషన్‌లో బడా మల్టీస్టారర్‌గా రూపొందిన చిత్రం RRR (రౌద్రం రణం రుధిరం). ఈ సినిమాను డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. రాజమౌళి డైరెక్ట్ చేయగా..కీరవాణి మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన రామ్ చరణ్ సరసన ఆలియా భట్, కొమురం భీమ్ పాత్రలో నటించిన ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. ఇక మొదటి రోజు నుండే బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం రాబడుతూ రెండు వారాల్లోనే వెయ్యి కోట్లు రాబట్టి సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రస్తుతం 33 రోజుల్లో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 33 రోజుల్లోనే రూ. 600.14 కోట్లు షేర్‌, రూ. 1114 కోట్లు గ్రాస్‌ సాధించింది.

ఏరియా వైజ్ గా చూస్తే..

- Advertisement -

నైజాంలో రూ. 6 లక్షలు, సీడెడ్‌లో రూ. 3 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 2 లక్షలు, ఈస్ట్‌లో రూ. 1 లక్షలు, వెస్ట్‌లో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 1 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. 33 రోజైన మంగళవారం రెండు రాష్ట్రాల్లో రూ. 16 లక్షలు షేర్, రూ. 30 లక్షలు గ్రాస్‌‌ను రాబట్టింది. మొత్తం 33 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 266.76 కోట్లు షేర్, రూ. 403.20 కోట్లు గ్రాస్ వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా 33 రోజుల్లోనే రూ. 600.14 కోట్లు షేర్‌, రూ. 1114 కోట్లు గ్రాస్‌ వసూలు సాధించింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All