Homeటాప్ స్టోరీస్ఆర్ఆర్ఆర్ 32 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

ఆర్ఆర్ఆర్ 32 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

Dosti Full Video Song Releasing Tomorrow at 4PM
Dosti Full Video Song Releasing Tomorrow at 4PM

ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలై నెల రోజులు పూర్తి చేసుకున్నప్పటికీ ..బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం కలెక్షన్ల జోరు కొనసాగుతూనే ఉంది. నందమూరి ఎన్టీఆర్, మెగా హీరో రామ్ చరణ్ కాంబినేషన్‌లో బడా మల్టీస్టారర్‌గా రూపొందిన చిత్రం RRR (రౌద్రం రణం రుధిరం). ఈ సినిమాను డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. రాజమౌళి డైరెక్ట్ చేయగా..కీరవాణి మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన రామ్ చరణ్ సరసన ఆలియా భట్, కొమురం భీమ్ పాత్రలో నటించిన ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. ఇక మొదటి రోజు నుండే బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం రాబడుతూ రెండు వారాల్లోనే వెయ్యి కోట్లు రాబట్టి సరికొత్త రికార్డు సృష్టించింది.

ఇక 32 వ రోజు కలెక్షన్స్ చూస్తే..

- Advertisement -

నైజాంలో రూ. 9 లక్షలు, సీడెడ్‌లో రూ. 4 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 4 లక్షలు, ఈస్ట్‌లో రూ. 1 లక్ష, వెస్ట్‌లో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్ష, కృష్ణాలో రూ. 1 లక్ష, నెల్లూరులో రూ. 1 లక్షతో.. 32 రోజైన సోమవారం రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 22 లక్షలు షేర్ రాబట్టింది. మొత్తం 32 రోజుల్లో కలెక్షన్స్ చూస్తే..

ఫలితంగా నైజాంలో రూ. 110.66 కోట్లు, సీడెడ్‌లో రూ. 50.54 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 34.59 కోట్లు, ఈస్ట్‌లో రూ.16.03 కోట్లు, వెస్ట్‌లో రూ. 13.11 కోట్లు, గుంటూరులో రూ. 17.96 కోట్లు, కృష్ణాలో రూ.14.48 కోట్లు, నెల్లూరులో రూ. 9.24 కోట్లతో కలిపి రూ. 266.60 కోట్లు షేర్, రూ. 402.50 కోట్లు గ్రాస్ రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 32 రోజుల్లో రూ. 599.54 కోట్లు షేర్‌, రూ. 1112.50 కోట్లు గ్రాస్‌ వసూలు రాబట్టి తెలుగు సినిమా సత్తా చాటింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All