
ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదలై 25 రోజులు కావొస్తున్నా బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం సందడి తగ్గలేదు. చాల థియేటర్స్ లలో ఇంకా హౌస్ ఫుల్ కలెక్షన్లు రాబడుతూ ఆశ్చర్య పరుస్తుంది. ఇప్పటికే నైజాంలో 109 కోట్లు వసూలు చేసి సంచలన రికార్డు అందుకోగా.. ఆంధ్రాలో అన్నిప్రాంతాలను కలిపి.. 155 కోట్ల షేర్‌ను రాబట్టింది.
ఇక 25వ రోజున కూడా ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 36 లక్షల షేర్‌ను సొంతం చేసుకొని … మొత్తం ఇప్పటివరకు 398.75 కోట్ల గ్రాస్తో వార్తల్లో నిలిచింది. ఇక 25 రోజుల్లో 1087 కోట్ల గ్రాస్, 588 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. రాజమౌళి కెరీర్‌లో 1000 కోట్లు సాధించడం ఇది రెండోసారి. గతంలో బాహుబలితో ఈ ఘనతను సాధించిన విషయం తెలిసిందే.
- Advertisement -