
అంత అనుకున్నట్లే ఆర్ఆర్ఆర్ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలుగా అలియా భట్ , సముద్ర ఖని , అజయ్ దేవగన్ ఇతర పాత్రల్లో నటించిన ఈ మూవీ నిన్న శుక్రవారం వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున విడుదలై సంచలన విజయం సాధించింది. భారీ అంచనాల మధ్య ..భారీ ఎత్తున థియేటర్స్ లలో విడుదల కావడం తో కలెక్షన్లు గత చిత్రాల రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నాయి.
ఫస్ట్ డే ఏకంగా వరల్డ్ వైడ్ గా రూ. 250 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టగా..రెండో రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 130 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. రెండు రోజుల్లోనే మొత్తం 350 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ చేసింది. 200 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసి అందర్నీ షాక్ లో పడేసింది. ఈ సినిమా 451 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగగా.. ఇప్పటికే 200 కోట్లకు పైగా రాగా ఇంకో 250 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ వస్తే సినిమాకి లాభాలు వచ్చినట్టే.