
ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలై 17 రోజులు కావొస్తున్నా బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకా దూకుడు కనపరుస్తూనే ఉంది. ముఖ్యంగా వీకెండ్ రోజుల్లో అన్ని చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్లతో రాణిస్తుంది. నిన్న ఆదివారం కూడా చాల చోట్ల అన్ని షోస్ ఫ్యామిలీ ఆడియన్స్ తో కిక్కిరిసిపోయినట్లు తెలుస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో 17 వ రోజు కలెక్షన్లు చూస్తే..
నైజాంలో రూ. 2.05 కోట్లు, సీడెడ్‌లో రూ. 68 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 63 లక్షలు, ఈస్ట్‌లో రూ. 29 లక్షలు, వెస్ట్‌లో రూ. 18 లక్షలు, గుంటూరులో రూ. 26 లక్షలు, కృష్ణాలో రూ. 24 లక్షలు, నెల్లూరులో రూ. 18 లక్షలతో.. ఆదివారం రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 4.51 కోట్లు షేర్, రూ. 7 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. ఫలితంగా మొత్తం 17 రోజుల్లో ఈ మూవీ రూ. 258.12 కోట్లు షేర్, రూ. 389 కోట్లు గ్రాస్ సాధించి వార్తల్లో నిలిచింది. వరల్డ్ వైడ్ గా చూస్తే రూ. 564.22 కోట్లు షేర్, రూ. 1029 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.