
ఓవర్సీస్ లో రెండు వారాల్లో ఆర్ఆర్ఆర్ ప్రభంజనం సృష్టించింది. ఏకంగా 13 మిలియన్ డాలర్స్ రాబట్టి తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’.. బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఎన్టీఆర్, చరణ్ ఈ సినిమాలో తమ నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు.
ఇక్కడ ..అక్కడ అనే తేడాలు లేకుండా విడుదలైన ప్రతి సెంటర్ లో రికార్డు స్థాయి వసూళ్లు రాబడుతూ దూసుకెళ్తుంది. ఓవర్సీస్ లో భారీ అంచనాల మధ్య విడుదలై ..ప్రీమియర్ తోనే రికార్డ్స్ వసూళ్లు రాబట్టి వార్తల్లో నిలిచిన ఆర్ఆర్ఆర్..రెండు వారాల్లో 13 మిలియన్ డాలర్స్ గ్రాస్ రాబట్టినట్లు అధికారిక ప్రకటన చేసారు. ఈ కలెక్షన్లతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
ఇక ఏపీ, తెలంగాణలో 13వ రోజు కలెక్షన్లు చూస్తే..
నైజాంలో రూ. 1.26 కోట్లు, సీడెడ్‌లో రూ. 37 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 32 లక్షలు, ఈస్ట్‌లో రూ. 18 లక్షలు, వెస్ట్‌లో రూ. 10 లక్షలు, గుంటూరులో రూ. 11 లక్షలు, కృష్ణాలో రూ. 10 లక్షలు, నెల్లూరులో రూ. 10 లక్షలతో.. 13వ రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 2.54 కోట్లు షేర్, రూ. 4 కోట్లు గ్రాస్‌ను మాత్రమే రాబట్టింది. దీంతో మొత్తం 13 రోజుల్లో రూ. 246.90 కోట్లు షేర్, రూ. 371 కోట్లు గ్రాస్ వచ్చింది.