Tuesday, August 16, 2022
Homeటాప్ స్టోరీస్విజ‌య్ దేవ‌ర‌కొండ ఒక్క‌డా నలుగురా?

విజ‌య్ దేవ‌ర‌కొండ ఒక్క‌డా నలుగురా?

విజ‌య్ దేవ‌ర‌కొండ ఒక్క‌డా నలుగురా?
విజ‌య్ దేవ‌ర‌కొండ ఒక్క‌డా నలుగురా?

విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. టాలీవుడ్‌లో ఓ సెన్సేష‌న్‌. స్టార్‌ల‌కే దిమ్మ‌దిరిగే ప‌బ్లిసిటీ ప్లానింగ్‌తో దేశ వ్యాప్తంగా క్రేజ్‌ని సొంతం చేసుకున్నారు. వ‌రుస క్రేజీ చిత్రాల‌తో డైన‌మిక్ హీరోగా దూసుకుపోతున్న విజ‌య్‌దేవ‌ర‌కొండ న‌టిస్తున్న తాజా చిత్రం `వ‌ర‌త్డ్ ఫేమ‌స్ అవ‌ర్‌`. క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో సీనియ‌ర్ నిర్మాత కె.ఎస్‌. రామారావు స‌మ‌ర్ప‌ణ‌లో కె.ఎ. వ‌ల్ల‌భ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా టైటిల్‌కి త‌గ్గ‌ట్టే సినిమా ప్ర‌మోష‌న్‌ని కూడా మేక‌ర్స్ డిఫ‌రెంట్‌గా ప్లాన్ చేసిన‌ట్టున్నారు. అందులో భాగంగానే వ‌రుస ఫ‌స్ట్‌లుక్‌ల‌ని రిలీజ్ చేస్తున్నారు.

- Advertisement -

ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండకు జోడీగా రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్యారాజేష్‌, కేథ‌రిన్‌, ఇజ‌బెల్లా లిల‌యితే న‌టిస్తున్నారు. ఒక్కో హీరోయిన్‌తో విజ‌య్ డిఫ‌రెంట్ లుక్‌లో వున్న లుక్‌ల‌ని ఈ నెల 12 నుంచి రిలీజ్ చేస్తున్నారు. ఐశ‌ర్వార్యా రాజేష్‌తో రిలీజ్ చేసిన లుక్‌లో విజ‌య్ మ‌ధ్య త‌ర‌గ‌తి భ‌ర్త‌గా క‌నిపిస్తున్నాడు. ఆ త‌రువాత ఫ్యాన్స్ న‌టి ఇజ‌బెల్లాతో వున్న లుక్‌లో మోడ్ర‌న్ ప్రేమికుడిగా విజ‌య్ క‌నిపిస్తున్నారు. కేథ‌రిన్‌తో క‌లిసి వున్న లుక్‌లో సింగ‌రేణి కార్మికుడిగా క‌నిపించిన విజ‌య్ తాజాగా రాశిఖ‌న్నాతో రిలీజ్ చేసిన స్టిల్ మ‌రింత యంగ్‌గా స్టైలిష్‌గా క‌నిపిస్తున్నాడు.

ఈ నాలుగు లుక్స్ లే దేఇన క‌దే డిఫ‌రెంట్‌గా క‌నిపిస్తూ ఇంత‌కీ విజ‌య్ దేవ‌ర‌కొండ ఒక్క‌డా లేక న‌లుగురా అన్న అనుమానం క‌లిగిస్తోంది. ఇక పాత్ర‌కో పేరు వుండ‌టంతో ఆ అనుమానాల‌కు మ‌రింత బ‌లాన్ని చేకూరుస్తోంది. అయితే చిత్ర బృందం మాత్రం అది మాత్రం సీక్రెట్ అని చెబుతోంది. జ‌న‌వరి 3న టీజ‌ర్ రిలీజ్ కాబోతున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ కొత్త త‌ర‌హా పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సినిమా వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 14న రిలీజ్ కానుంది.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts