Homeటాప్ స్టోరీస్హీరో ని మర్డర్ చేయడానికి ప్లాన్ చేశారట

హీరో ని మర్డర్ చేయడానికి ప్లాన్ చేశారట

rowdy cycle ravi murder attempt on hero yashకన్నడ యంగ్ హీరో యష్ ని మర్డర్ చేయడానికి ప్లాన్ చేశారట రౌడీ షీటర్ సైకిల్ రవి . సంచలనం సృష్టించిన ఈ సంఘటనని బెంగుళూర్ పోలీసులు చేధించారు . కన్నడంలో పలు చిత్రాల్లో నటించిన యష్ ని చంపేయాలని రౌడీ సైకిల్ రవి తో పాటు కోదండరామ వ్యూహం పన్నారట . అయితే అది ఇప్పుడు కాదు రెండేళ్ల క్రితమట ,ఓ కన్నడ నిర్మాతకు హీరో యష్ కు మధ్య జరిగిన గొడవలో భాగంగా యష్ ని మర్డర్ చేయాలనీ పథకం పన్నారట రౌడీషీటర్లు . అప్పుడే ఈ విషయం పై అనుమానం వచ్చిన యష్ నేరుగా పోలీస్ ఉన్నతాధికారులను సంప్రదించి ఫిర్యాదు చేసాడు .

అయితే అప్పట్లో రౌడీ సైకిల్ రవి , కోదండ రామ పోలీసులకు దొరకలేదు ఇటీవలే రౌడీ సైకిల్ రవి ని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే కోదండ రామ మాత్రం ఇంతవరకు పోలీసులకు దొరకలేదు . ప్రస్తుతం రౌడీ సైకిల్ రవి ని విచారణ చేస్తున్నారు పోలీసులు , రెండేళ్ల క్రితం ప్లాన్ చేసిన సంఘటన కానీ ఇప్పుడు వాళ్లకు యష్ ని చంపాలన్న ఉద్దేశ్యం లేదని అంటున్నారు పోలీసులు .

- Advertisement -

ఇక నటుడు యష్ కూడా ఈ మర్డర్ పాన్ ని లైట్ గా తీసుకుంటున్నాడు ఎందుకంటే వాళ్ళు నన్ను చంపాలని అనుకున్నది నిజమే కానీ అది ఇప్పుడు కాదు రెండేళ్ల క్రితం పైగా ఆ సమస్య పరిష్కారం అయ్యింది కాబట్టి నాకు ఎటువంటి ప్రాణహాని లేదని చెబుతున్నాడు .

English Title: rowdy cycle ravi murder attempt on hero yash

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All