Homeటాప్ స్టోరీస్ఎపిక్ బ్లాక్ బ‌స్ట‌ర్ `మ‌హ‌ర్షి` సంగీతంలో భాగ‌మైన టెక్నీషియ‌న్స్‌కు ట్రిబ్యూట్ వీడియో విడుద‌ల చేస్తున్న రాక్...

ఎపిక్ బ్లాక్ బ‌స్ట‌ర్ `మ‌హ‌ర్షి` సంగీతంలో భాగ‌మైన టెక్నీషియ‌న్స్‌కు ట్రిబ్యూట్ వీడియో విడుద‌ల చేస్తున్న రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్‌

డి.ఎస్‌.పి…దేవిశ్రీ ప్ర‌సాద్
నేటి యువ సంగీత సంచ‌ల‌నం.. రెండు ద‌శాబ్దాల ప్ర‌యాణంలో ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్స్‌, బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ చిత్రాల‌కు సంగీతం అందించిన మ్యూజిషియ‌న్‌. ప్రేక్ష‌కుల‌కు ఫుట్ టాపింగ్ సంగీతం అందిస్తున్న డి.ఎస్‌.పి ని అంద‌రూ రాక్‌స్టార్ అని పిలుచుకుంటారు. ఈ ఏడాది ఈ `మ‌హ‌ర్షి`వంటి సెన్సేష‌న‌ల్ హిట్‌కు సంగీతాన్ని అందించి టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ అయ్యారు.
`మ‌హ‌ర్షి` సూప‌ర్ స్టార్ మ‌హేశ్ కెరీర్‌లోనే మైల్‌స్టోన్ మూవీయే కాదు.. ఆయ‌న సిల్వ‌ర్ జూబ్లీ మూవీ కూడా కావ‌డం విశేషం. సూపర్ స్టార్ అభిమానులు `మ‌హ‌ర్షి` సినిమా కోసం ఎంత అతృత‌గా ఎదురు చూశార‌న‌డానికి ఆ సినిమా సాధించిన స‌క్సెసే రుజువుగా నిలిచింది. ఈ సినిమా ప్రారంభం నుండి విడుద‌ల వ‌ర‌కు ఉన్న అంచ‌నాల‌ను క్యారీ చేయ‌డంలో దేవిశ్రీ ప్ర‌సాద్ అందించిన సంగీతం కీల‌క భూమిక పోషించింది. రైతు కోసం పోరాడే క‌థానాయ‌కుడి ఫీల్‌ను త‌న సంగీతంతో ప్రేక్ష‌కుడి గుండెకు హ‌త్తుకునేలా చేయ‌డం దేవిశ్రీకే చెల్లింద‌నాలి. ఇక సినిమాలో బ్యాగ్రౌండ్ స్కోర్ గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. సినిమా కంటెంట్‌, సోల్‌, ఎమోష‌న్‌ను చివ‌రి వ‌ర‌కు ఆడియన్ క‌ట్టిప‌డేసేలా చేసిన బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందించారు డి.ఎస్‌.పి.
సినిమాకు ప‌నిచేసే శాఖ‌ల‌న్నీ వాటి ప‌నుల‌ను స‌మ‌ర్ధ‌వంతంగా నిర్వ‌హించాల‌నే విష‌యాన్ని ఎవ‌రూ కాద‌న‌లేరు. అప్పుడే ఓ సినిమాకు ప‌రిపూర్ణ విజ‌యం సాధ్య‌మ‌వుతుంది. అయితే ద‌ర్శ‌కుడు త‌న చెప్పాల‌నుకున్న ఫీల్‌ను ఆడియ‌న్‌కు క‌నెక్ట్ అయ్యేలా చేసేది మాత్రం సంగీతం.. ముఖ్యంగా మ‌హ‌ర్షి బ్యాగ్రౌండ్ స్కోర్ టాప్ నాచ్‌లో నిలిచింది. ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి, రాక్‌స్టార్‌పై పూర్తి భ‌రోసాతో ఇచ్చిన స్వేచ్ఛ‌ను .. అందుకు వ‌చ్చిన రిజ‌ల్టే సోదాహ‌ర‌ణంగా నిలిచింది.
`మ‌హ‌ర్షి` విజ‌యంలో చాలా పెద్ద పాత్ర‌ను పోషించిన రాక్‌స్టార్ దేవిశ్రీ ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ …“ఎపిక్ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచిన `మ‌హ‌ర్షి` విడుద‌లై నెల‌రోజుల‌వుతుంది. ఇంత‌టి గొప్ప విజ‌యాన్ని అందించి, అంద‌మైన అనుభూతిని మిగిల్చిన ప్ర‌తి ఆడియ‌న్‌కు మ‌న‌స్ఫూర్తిగా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను. పాట‌లు, బ్యాగ్రౌండ్ స్కోర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇంత మంచి సినిమాలో న‌న్ను భాగం చేసిన సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌, ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి, నిర్మాత‌లు దిల్‌రాజు, అశ్వ‌నీద‌త్‌గారు, పివిపిగారికి థాంక్స్‌. నా సంగీతంపై మ‌హేష్‌గారు చూపే ఆద‌ర‌ణ‌, న‌మ్మ‌కానికి ఆయ‌న‌కు నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. అలాగే సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌గారి త‌దుప‌రి చిత్రం `స‌రిలేరు నీకెవ్వ‌రు`కి కూడా వ‌ర్క్ చేసే అవ‌కాశాన్ని ఇచ్చినందుకు థాంక్స్‌. ఈ సంద‌ర్భంగా ఈ సినిమాకు నేను ఇంత మంచి సంగీతం అందించానంటే కార‌ణం నా టీం. నాతో పాటు వ‌ర్క్ చేసిన టెక్నీషియ‌న్స్ ఎవ‌ర‌నేది చాలా మందికి తెలియ‌క‌పోవ‌చ్చు. ఇంత మంచి ఆల్బ‌మ్‌, బ్యాగ్రౌండ్ స్కోర్ రావ‌డానికి కార‌ణ‌మైన ఈ టెక్నీషియ‌న్స్‌కు ట్రిబ్యూట్‌గా ఓ వీడియో విడుద‌ల చేస్తున్నాను. ఈ వీడియోలో సినిమా మ్యూజిక్‌లో పార్ట్ అయిన టెక్నీషియ‌న్స్ అందరినీ చూపిస్తున్నాం. ప్రేక్ష‌కులు ఇలాగే వారి అభిమానాన్ని, ప్రేమ‌ను నాపై చూపిస్తూ ఉండాల‌ని కోరుకుంటున్నాను. థాంక్యూ…“ అన్నారు.
……………………………………

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All