Homeటాప్ స్టోరీస్స్టూడియోని అమ్మకానికి పెట్టారు

స్టూడియోని అమ్మకానికి పెట్టారు

rishi kapoor family selling rk studiosబాలీవుడ్ దిగ్గజం రాజ్ కపూర్ స్థాపించిన ” ఆర్ కె ” స్టూడియో ని అమ్మకానికి పెట్టారు ఆయన వారసులు . 1948 లో రాజ్ కపూర్ ఈ ఆర్ కే స్టూడియో ని నిర్మించాడు . ఈ స్టూడియోలో వందల చిత్రాలు నిర్మాణాలు జరుపుకున్నాయి అయితే గత ఏడాది ఈ స్టూడియోలో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో రాజ్ కపూర్ కి చెందిన పలు విలువైన వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి , అలాగే పెద్ద మొత్తంలో నష్టం వచ్చింది దాంతో స్టూడియో ని ఆధునిక వసతులతో నిర్మించాలని అనుకున్నారు కానీ నిర్మాణ ఖర్చు , అలాగే స్టాఫ్ జీతభత్యాలు అన్నీ లెక్కలేనుకొని కుటుంబంలో చర్చించారట !

రిషికపూర్ తో పాటుగా రణధీర్ కపూర్ అలాగే ఇతర కుటుంబసభ్యులు తీవ్రంగా చర్చించిన మీదట పునర్నిర్మించి నష్టాలు మూట కట్టుకునే కంటే అమ్మడమే బెటర్ అని నిర్ణయానికి వచ్చారట దాంతో పురాతన స్టూడియో అయిన ఆర్కే స్టూడియో అమ్మకానికి సిద్దమయ్యింది . ఎన్నో మరుపురాని చిత్రాలను అందించిన ఆర్కే స్టూడియో అమ్మకానికి పెట్టడంతో ఇక దాని రూపురేఖలు మారిపోనున్నాయి . అయితే ఈ స్టూడియో ని అమ్మకానికి పెట్టడం వల్ల వందల కోట్లలో డబ్బులు వచ్చి పడనున్నాయి రిషి కపూర్ అండ్ కో కు .

- Advertisement -

English Title: rishi kapoor family selling rk studios

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All