Homeటాప్ స్టోరీస్పాయ‌ల్ పై రిచా ప‌రువు న‌ష్టం దావా?

పాయ‌ల్ పై రిచా ప‌రువు న‌ష్టం దావా?

పాయ‌ల్ పై రిచా ప‌రువు న‌ష్టం దావా?
పాయ‌ల్ పై రిచా ప‌రువు న‌ష్టం దావా?

బాలీవుడ్‌లో  లైంగిక వేధింపుల వ్య‌వ‌హారంపై అరోప‌ణ‌ల ఫ‌ర్వం చూస్తున్న‌దే. అనురాగ్ క‌శ్య‌ప్ – పాయ‌ల్ ఘోష్ ఎపిసోడ్ ఇటీవ‌ల స‌ర్వ‌త్రా హాట్ టాపిక్ గా మారింది. ఆ ద‌ర్శ‌కుడు త‌న‌ను లైంగికంగా వేధించాడ‌ని పాయ‌ల్ ఆరోపించింది. అంతేకాదు.. అత‌డికి ఫ‌లానా క‌థానాయిక‌లు జ‌స్ట్ ఫోన్ కాల్ దూరంలో అందుబాటులో ఉంటార‌ని పాయ‌ల్ ఘోష్ పేర్లు వెల్ల‌డించ‌డం సంచ‌ల‌న‌మైంది.

అయితే ఈ వ్య‌వ‌హారం కాస్తా ర‌చ్చ ర‌చ్చ‌వుతోంది. పాయ‌ల్ ఆరోప‌ణ‌ల‌తో ప‌రువు న‌ష్టం దావా వేయాల‌ని క‌థానాయిక రిచా చ‌ద్దా నిర్ణ‌యించుకుని కోర్టు నోటీసులు పంప‌డం వేడెక్కించింది. అయితే లీగ‌ల్ నోటీసులు అందుకునేందుకు పాయ‌ల్ నిరాక‌రించింద‌ని రిచా చ‌ద్దా ఆరోపిస్తున్నారు. నోటీసు హార్డ్ కాపీని చేతికి అందజేయడానికి తన న్యాయవాద‌ బృందంలోని సభ్యులు పాయ‌ల్ ఘోష్ నివాసానికి వెళ్లారని కానీ ఆమె దానిని అందుకోవ‌డానికి  నిరాకరించార‌ని తెలిపారు.

- Advertisement -

పాయల్ ఘోష్ వాదనలను అనురాగ్ కశ్యప్ ఖండించినా.. ఆమె పోలీసుల‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ద‌ర్శ‌క‌నిర్మాత అనురాగ్ కశ్యప్ లైంగిక దుష్ప్రవర్తనకు పాల్పడ్డార‌ని ఆరోపించిన‌ ఘోష్ రిచా చ‌ద్దా స‌హా  ఇతర మహిళా కళాకారులు కూడా దర్శకుడితో సన్నిహితంగా ఉన్నారని ఆరోపించారు. త‌న ప‌రువు మ‌ర్యాద‌ల‌కు పాయ‌ల్ భంగం క‌లిగించింద‌ని రిచా కోర్టునాశ్ర‌యించ‌నున్నారు. మ‌రోవైపు లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న అనురాగ్ కి అత‌డి మాజీ భార్య‌లు అండ‌గా నిల‌వ‌డం కొస‌మెరుపు. దర్శకుడు అనురాగ్ తన సినీ పరిశ్రమ మిత్రులలో.. హన్సాల్ మెహతా.. తాప్సీ ప‌న్నులతో పాటు అతని మాజీ భార్యలు.. ఫిల్మ్ ఎడిటర్ ఆర్తి బజాజ్ .. నటి కల్కి కోచ్లిన్ ల‌కు బాలీవుడ్ లో చ‌క్క‌ని కెరీర్ ని అందించారు. వారంతా ఇప్పుడు అత‌డికి అండ‌గా నిలుస్తుండ‌డం ఆస‌క్తిక‌రం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All