
మహేష్‌బాబుకు తల్లిగా నటించడానికైనా నేనను రెడీ అంటూ ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు రేణు దేశాయ్. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌తో విడిపోయి గత కొంత కాలంగా పిల్లలతో కలిసి ఒంటరిగా వుంటున్నారామె. మళ్లీ సినిమాల్లో నటించాలని, డైరెక్ట్ చేయాలని గత కొన్ని నెలలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. పలు టీవీ షోలకు న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరిస్తున్న పవన్‌కల్యాణ్ మాజీ సతీమణి రేణు దేశాయ్ ఓ భారీ చిత్రంలో స్టార్ హీరోకు విదినగా కనిపించనుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే.. సూపర్‌స్టార్ మహేష్ హీరోగా నటిస్తున్న చిత్రం `సర్కారు వారి పాట`. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నారు. బ్యాంక్ స్కామ్ నేపథ్యంలో ఈ మూవీ కథ సాగనుంది. ఇందు కోసం ప్రత్యేకంగా ఆర్ ఎఫ్ సీలో బ్యాంక్ సెట్‌ని ఏర్పాటు చేశారు.
ఈ మూవీలోని కీలక పాత్రలో మహేష్‌కి వదినగా రేణు దేశాయ్ నటించనుందని తెలిసింది. ఇందుకు సంబంధించిన చిత్ర వర్గాలు ఆమెతో సంప్రదింపులు కూడా జరిపాయని చెబుతున్నారు. ఇది ఎంత వరకు నిజమన్నది తెలియాలంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ వరకు వేచి చూడాల్సిందే.