Homeటాప్ స్టోరీస్రేణుదేశాయ్ ఎంగేజ్ మెంట్ అయ్యింది

రేణుదేశాయ్ ఎంగేజ్ మెంట్ అయ్యింది

 Renu Desai confirms her engagement పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కి తాజాగా ఎంగేజ్ మెంట్ అయ్యింది . తనకు ఎంగేజ్ మెంట్ అయిన విషయాన్నీ తానే స్వయంగా వెల్లడించింది . తనకు కాబోయే వాడి చేయి ని పట్టుకొని దిగిన ఫోటో ని సోషల్ మీడియాలో షేర్ చేసింది రేణు దేశాయ్ . దాంతో రేణు రెండో వివాహ ఘట్టానికి తెరలేచినట్లైంది . ఇన్నాళ్లు పెళ్లి చేసుకోకుండా ఇద్దరు పిల్లలతో జీవనం సాగించిన రేణు కి ఆమధ్య అనారోగ్యం సోకడంతో మంచాన పడింది. ఆ సమయంలోనే పెళ్లి చేసుకోవాలని గట్టిగా నిర్ణయం తీసుకుందట .

నిర్ణయం తీసుకోవడమే ఆలస్యం ఆరోగ్యం కుదుట పడిన తర్వాత తన జతగాడు ఎక్కడున్నాడో వెతుక్కుంది , కట్ చేస్తే తనకు కావాల్సిన వాడు దొరికాడు దాంతో రెండో వివాహానికి సిద్ధమైంది . అయితే అతడు ఎవరు ? ఏం చేస్తుంటాడు ? ఎక్కడి వ్యక్తి అన్నది మాత్రం బయటకు పొక్కనీయడం లేదు రేణు దేశాయ్ . ఈ భామ రెండో వివాహ నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలియడంతో సోషల్ మీడియాలో పెద్ద వైరల్ అయ్యింది . అయితే రేణు ని విమర్శించే వాళ్ళ కంటే రెండో పెళ్లి కి సిద్దమైనందుకు శుభాకాంక్షలు అందజేసేవాళ్ళే ఎక్కువయ్యారు దాంతో రేణు దేశాయ్ సంతోషాన్ని వ్యక్తం చేసింది .

- Advertisement -

English Title: renu desai confirms her engagement

renu desai confirms her engagement ,renu desai , confirms her engagement, pawan kalyan

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All