Homeటాప్ స్టోరీస్ఆ సినిమా సకాలంలో రిలీజ్ అవుతుందా

ఆ సినిమా సకాలంలో రిలీజ్ అవుతుందా

release problem for rajinikanth kaalaసూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కాలా చిత్రం సెన్సార్ కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తిచేసుకుంది . ఏప్రిల్ 27న విడుదల కావాల్సి ఉంది షెడ్యూల్ ప్రకారం అయితే తమిళనాట థియేటర్ లు మూతపడి ఉన్నాయి దాంతో కాలా సకాలంలో విడుదల అవుతుందా అన్న అనుమానం నెలకొంది . ఇక ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు యు / ఏ సర్టిఫికెట్ ఇచ్చారు . అలాగే పది కట్స్ కూడా చెప్పారట .

అయితే అది సమస్య కాదు కానీ తమిళ నాట క్యూబ్ , యు ఎఫ్ ఓ లకు వ్యతిరేకంగా సమ్మె జరుగుతోంది దాంతో విడుదలపై నీలినీడలు కమ్ముకున్నాయి . రజనీ సినిమా అంటే ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది కానీ తమిళనాట విడుదల చేయకుండా మిగతా చోట్ల ఎలా రిలీజ్ చేస్తారు అన్నది ప్రశ్న . ఒకవేళ అప్పటి వరకు సమస్య పరిష్కారం అవుతే కాలా కు తిరుగే లేదు . పా రంజిత్ దర్శకత్వంలో రజనీ అల్లుడు ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మించాడు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All