Homeటాప్ స్టోరీస్ఆ అనుభూతే వేరుగా వుంటుంది : రామ్‌

ఆ అనుభూతే వేరుగా వుంటుంది : రామ్‌

ఆ అనుభూతే వేరుగా వుంటుంది : రామ్‌
ఆ అనుభూతే వేరుగా వుంటుంది : రామ్‌

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా న‌టిస్తున్న థ్రిల్ల‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్ `రెడ్‌`. కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మాళ‌విక శ‌ర్మ‌, నివేదా పేతురాజ్ హీరోయిన్‌లుగా న‌టించారు. స్ర‌వంతి మూవీస్ బ్యాన‌ర్‌పై స్ర‌వంతి రవికిషోర్ నిర్మించారు. మ‌ణిశ‌ర్మ సంగీతం అందించిన ఈ చిత్ర‌ గీతాలు ఇప్ప‌టికే మంచి విజ‌యాన్ని సాధించాయి. సంక్రాంతికి విడుద‌ల కానున్న ఈ మూవీ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ని చిత్ర బృందం గురువారం విడుద‌ల చేసింది.

ఈ సంద‌ర్భంగా స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు మాట్లాడుతూ `చాక్లెట్ బాయ్ ఇమేజ్ నుండి `ఇస్మార్ట్ శంక‌ర్‌`లో విశ్వ‌రూపం చూపించి రామ్ మాస్ ఇమేజ్‌ని కూడా సొంతం చేసుకున్నాడు. `రెడ్‌`తో ఆ ఇమేజ్‌ను రెండింత‌లు చేసుకోబోతున్నాడు. ఆశ్చ‌ర్యం ఏంటంటే చాలా సున్నితంగా, క్లాస్‌గా క‌నిపించే కిషోర్ తిరుమ‌ల కూడా తాను మాస్ చిత్రాలు రాయ‌గ‌ల‌న‌ని, తీయ‌గ‌ల‌న‌ని నిరూపించుకోబోతున్నాడు. ఈ చిత్రంలోని థ్రిల్లింగ్ స్టోరీ, స‌న్నివేశాలు అద్భుతంగా వున్నాయి. అలాగే హీరో రామ్ డ‌బుల్ రోల్‌లో చాలా బాగా న‌టించాడు. ఖ‌చ్చితంగా హిట్టుకొట్ట‌బోతున్న చిత్ర‌మిది. నిర్మాత ర‌వికిషోర్‌గారి నిర్ణ‌యాలు, డైరెక్ట‌ర్ కిషోర్ తిరుమ‌ల క‌థ విష‌యంలో తీసుకునే జాగ్ర‌త్త‌లు ఈ చిత్రంలోనూ క‌నిపిస్తాయి. మ‌ణిశ‌ర్మ సంగీతం బ‌లంగా నిలుస్తుంది. `ఇస్మార్ట్ శంక‌ర్` త‌రువాత ఈ పంగ‌డ‌క్కి వ‌స్తున్న రెడ్ రామ్‌కి దానికి మించిన హిట్‌ని ఇవ్వ‌బోతోంది` అన్నారు.

- Advertisement -

హీరో రామ్ మాట్లాడుతూ `ఇంట్లో పూజ‌గ‌ది వున్నా గుడికే వెళ‌తాం. వంట చేసుకోగ‌లిగినా హోట‌ల్‌కే వెళ‌తాం. అలాగే ఎన్ని ఓటీటీలు వచ్చినా థియేట‌ర్ల‌కే వెళ్ళి సినిమాలు చూస్తాం. ఆ అనుభూతే వేరుగా వుంటుంది. ఇలా థియేట‌ర్‌లో మ‌ళ్లీ ట్రైల‌ర్‌ని చూడ‌టం చాలా కొత్త‌గా వుంది. ఇన్నిరోజుల విరామం, వాయిదాలు, క‌ష్టాలు అన్నీ మ‌ర్చిపోతాం. థియేట‌ర్ల‌లో సినిమా చూస్తే ఒక కొత్త ప్ర‌పంచంలోకి వెళ్లిపోతాం. అలాంటి అనుభూతి అంద‌రికి ఇవ్వాల‌నే చాలా గ‌ట్టిగా నిర్ణ‌యించుకున్నారు స్ర‌వంతి ర‌వికిషోర్‌గారు. కిషోర్ తిరుమ‌ల, స‌మీర్‌రెడ్డిగారి లాంటి ప్ర‌తిభ గ‌ల టెక్నీషియ‌న్స్‌కి ఒక కొత్త జాన‌ర్ ఇస్తే ఇలా తీస్తారో అని నా కొచ్చిన సందేహాన్ని పూర్తిగా మార్చేసి వేరే లెవెల్ కంటెంట్‌ని విజువ‌ల్స్‌ని ఇచ్చారు. ప్రేక్ష‌కులంద‌రూ జాగ్ర‌త్త‌గా వుంటూనే థియేట‌ర్ల‌కు రావాల‌ని కోరుకుంటున్నాం` అన్నారు.

10 నెల‌ల్లో కోల్పోయిన ఆనందాల్లో థియేట‌ర్లు కూడా ఒక‌ట‌. ఈ 10 నెల‌ల విరామానికి ఆనందంన‌దింత‌ల‌య్యి మీకు చేరాల‌ని కోరుకుంటున్నాం. ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశం స్ర‌వంతి ర‌వికిషోర్ గారికి ధ‌న్య‌వాదాలు` అని ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో నిర్మాత స్ర‌వంతి ర‌వికిషోర్‌, మాళ‌విక శ‌ర్మ, నివేదా పేతురాజ్‌, కె.ఎల్‌. దామోద‌ర‌ప్ర‌సాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All