Homeటాప్ స్టోరీస్ఓవర్ సీస్ లో రికార్డ్ బద్దలు కొట్టిన బాలయ్య

ఓవర్ సీస్ లో రికార్డ్ బద్దలు కొట్టిన బాలయ్య

Record collections for NTR Kathanayakudu in overseasనటసింహం నందమూరి బాలకృష్ణ కు ఓవర్ సీస్ లో అంతగా మార్కెట్ లేదు . ఇక్కడ సింహమే కానీ అక్కడ మాత్రం అంత సీన్ లేదు బాలయ్యకు , కానీ గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంతో ఒక్కసారిగా ఓవర్ సీస్ ప్రేక్షకులను కూడా అలరించడం మొదలు పెట్టాడు బాలయ్య . కట్ చేస్తే ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ లో భాగమైన ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంతో తన రికార్డ్ ని తానే రికార్డ్ బద్దలు కొట్టాడు . రికార్డులు సృష్టించాలన్నా మేమె దాన్ని తిరగ రాయాలన్నా మేమే అంటూ సింహగర్జన చేసే బాలయ్య ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంతో కేవలం ప్రీమియర్ షోలతోనే 5 లక్షల డాలర్లకు పైగా వసూల్ చేసి చరిత్ర సృష్టించాడు .

అంతేకాదు ఈ ఏడాది ప్రారంభంలో ఇంత భారీ మొత్తాన్ని వసూల్ చేసిన మొదటి సినిమాగా రికార్డ్ సృష్టించాడు . ఇక 2018 – 19 సంవత్సర కాలంలో అత్యధిక స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రాల్లో 6 వ చిత్రంగా నిలిచింది ఎన్టీఆర్ కథానాయకుడు . ఎన్టీఆర్ బయోపిక్ కోసం ఓవర్ సీస్ జనాలు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు . మహానటుడు , మహా నాయకుడు ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం కావడంతో ఈ సినిమా చూడాలన్న ఉత్సాహం నెలకొంది .

- Advertisement -

English Title: Record collections for NTR Kathanayakudu in overseas

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All