Homeటాప్ స్టోరీస్రియల్ హీరో విశాల్

రియల్ హీరో విశాల్

real hero vishal :big help for telugu formersతమిళనాట స్టార్ హీరో అయిన విశాల్ అచ్చ తెలుగు కుర్రాడు , అయితే చెన్నై లో స్థిరపడిపోవడం వల్ల తెలుగు చిత్రాలకంటే తమిళ చిత్రాలపైనే ఆసక్తి కనబరిచాడు ఎంతైనా తెలుగువాడు కాబట్టి తమిళ చిత్రాలను తెలుగులో కూడా డబ్ చేస్తూ ఇక్కడ కూడా మార్కెట్ పెంచుకున్నాడు . అంతేకాదు తెరమీద మాత్రమే హీరో పాత్రలు పోషించడం కాదు రియల్ లైఫ్ లో కూడా హీరోనే ! సమస్య ఎక్కడ ఉన్నా వెంటనే స్పందించే తత్వం విశాల్ ది అందుకే తమిళనాట పలు సంచలనాలు నమోదు చేసాడు . దక్షిణ భారత నటీనటుల సంఘం లో పేరుకి పోయిన వాళ్ళని కూకటి వేళ్ళతో పెకిలించాడు . అలాగే నిర్మాతల మండలి లో కూడా .

ఇక రైతుల సమస్యల పై స్పందించిన విశాల్ తాజాగా తమిళనాట విడుదలై సంచలన విజయం సాధిస్తున్న ” ఇరుంబు తిరై ” చిత్ర వసూళ్ల లో ఒక్కో టికెట్ మీద ఒక్క రూపాయి రైతులకు ఇవ్వడానికి ముందుకు వచ్చాడు . ఇదే చిత్రాన్ని తెలుగు లో అభిమన్యుడు గా విడుదల చేస్తే ఇక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది . మొదటి వరంలోనే 12 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించింది దాంతో తెలుగు రైతులకు కూడా ఒక్కో టికెట్ పై ఒక్కో రూపాయి ఇవ్వనున్నట్లు ప్రకటించాడు విశాల్ . ఒక్కో రూపాయి అని తీసి పడేయద్దు ఎందుకంటే రెండు రాష్ట్రాలలో కలిపి అవలీలగా కోటి రూపాయలకు పైగానే రావచ్చు మరి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All