
రామ్ చరణ్ – శంకర్ కలయికలో పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని దిల్ రాజు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తీ చేసుకుంది. సాధారణంగా శంకర్ సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తప్పనిసరిగా ఉండేలా చూసుకుంటాడు. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుంది. జెంటిల్ మేన్ , భారతీయుడు , అపరిచితుడు లాంటి చిత్రాల్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఎమోషన్ ని రగిలిస్తాయి. థియేటర్లలో ఆడియెన్ కి పూనకాలు పుట్టిస్తాయి.
అందుకే ఇప్పుడు రామ్ చరణ్ తో చేస్తున్న సినిమాలో కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ ని పెట్టాడట. ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ గా ఉండబోతుందని అంటున్నారు. తాజాగా ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో చరణ్ తాలూకా లుక్ బయటకు లీక్ అయ్యింది. ఈ లుక్ లో చరణ్ పల్లెటూరి కుర్రాడి కనిపిస్తున్నాడు. సాంప్రదాయ పంచె కట్టు వేషధారణలో పక్క పాపిడి చేతికి నల్ల కాశీ తాడు.. వైట్ అండ్ వైట్ లుక్ లో హ్యాండ్ మడత పెట్టి సైకిల్ పై అలా వెళుతున్నాడు. భుజాలపై కండువాతో కోర మీసాలతో కనిపిస్తున్నాడు. ఇక ఈ మూవీ లో చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తాడని అంటున్నారు.