
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన గని మూవీ ఏప్రిల్ 08 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ తరుణంలో చిత్ర ప్రమోషన్లో భాగంగా ఈరోజు గురువారం చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేసి సినిమా ఫై అంచనాలు పెంచారు. ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ సందర్బంగా మాస్ మహారాజా రవితేజ సోషల్ మీడియా వేదిక గా స్పందించారు. గని చిత్ర యూనిట్ కి సూపర్ సక్సెస్ రావాలి అంటూ చెప్పుకొచ్చారు. హిట్ ఇట్ హార్డ్ అంటూ తెలిపారు. మాస్ మహారాజా రవితేజ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
`గని ఇంక లైఫ్ లో బాక్సింగ్ ఆడననిప్రామిస్ చెయ్.. అంటే తల్లి పాత్రలో నటించిన నదియా చెబుతున్న డైలాగ్స్ తో ట్రైలర్ మొదలవుతుంది. గద్దలకొండ గణేష్ తర్వాత వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని ఎందుకున్నాడు. కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా ఈ చిత్రం ద్వారా పరిచయమవుతున్నాడు. ఎస్ ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని సిద్దు ముద్దా, అల్లు బాబీ నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా ఓ స్పెషల్ సాంగ్‌లో సందడి చేయడం విశేషం.