Homeటాప్ స్టోరీస్ప్యాన్ ఇండియన్ సినిమాను అనౌన్స్ చేయనున్న మాస్ మహారాజా

ప్యాన్ ఇండియన్ సినిమాను అనౌన్స్ చేయనున్న మాస్ మహారాజా

ప్యాన్ ఇండియన్ సినిమాను అనౌన్స్ చేయనున్న మాస్ మహారాజా
ప్యాన్ ఇండియన్ సినిమాను అనౌన్స్ చేయనున్న మాస్ మహారాజా

మాస్ మహారాజా రవితేజ దూకుడు మాములుగా లేదు. క్రాక్ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఒకటి తర్వాత ఒకటిగా చిత్రాలను అనౌన్స్ చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ఖిలాడీ షూటింగ్ ను పూర్తి చేసిన రవితేజ ప్రస్తుతం రెండు సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు. కొత్త దర్శకుడు శరత్ మండవ తెరకెక్కిస్తోన్న రామారావు ఆన్ డ్యూటీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మరోవైపు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఫన్ ఎంటర్టైనర్ ధమాకా షూటింగ్ కూడా జరుగుతోంది.

రీసెంట్ గా సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ మైల్ స్టోన్ 70వ చిత్రాన్ని అనౌన్స్ చేసాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలవుతుంది. ఇక ఇప్పుడు మరో చిత్రాన్ని అనౌన్స్ చేస్తున్నాడు మాస్ మహారాజా. అయితే ఈసారి తన కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఈసారి 71వ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవెల్లో చేయబోతున్నాడు రవితేజ.

- Advertisement -

ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు నవంబర్ 3న మధ్యాహ్నం 12 గంటల 6 నిమిషాలకు అనౌన్స్ చేస్తారని అధికారికంగా తెలియజేసారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ చిత్రాన్ని భారీ లెవెల్లో నిర్మించనున్నారు. ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇలా వరసగా రవితేజ సినిమాలను అనౌన్స్ చేస్తుండడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All