Homeటాప్ స్టోరీస్ఆ సినిమా ఆగిపోలేదట !

ఆ సినిమా ఆగిపోలేదట !

- Advertisement -

రవితేజ హీరోగా వి ఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డిస్కో రాజా చిత్రం ఆగిపోలేదని తాజాగా ఓ ప్రకటన విడుదల చేసాడు ఆ చిత్ర నిర్మాత రామ్ తాళ్లూరి . డిస్కో రాజా సినిమా ఆగిపోయిందని వార్తలు జోరుగా రావడంతో కలత చెందిన ఆ చిత్ర బృందం ఆమేరకు ఓ ప్రకటన జారీ చేసారు . అయితే ఇలా డిస్కో రాజా ఆగిపోయిందని వార్తలు రావడానికి కారణం ఏంటో తెలుసా ……. చాలాకాలంగా షూటింగ్ జరగకపోవడమే !

అయితే ఇలా షూటింగ్ ఆగిపోవడానికి మరో కారణం కూడా ఉంది . రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రం పరమ చెత్త గా ఫలితం పొందడమే ! దాంతో కాబోలు లేక నిర్మాతలు చెబుతున్న టెక్నీకల్ ఇష్యు కావచ్చు కానీ డిస్కో రాజా మీద అయితే ప్రభావం పడింది . రవితేజ ద్విపాత్రాభినయం పోషిస్తున్న డిస్కో రాజా సెకండ్ షెడ్యూల్ మే 27 నుండి జరుగుతుందట . రవితేజ కు గతకొంత కాలంగా వరుస పరాజయాలు పలకరిస్తున్నాయి దాంతో రేసులో లేకుండాపోయాడు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts