
మెగా స్టార్ చిరంజీవి – బాబీ కలయికలో మెగా మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా..ఓ కీలక పాత్రకు గాను మాస్ రాజా రవితేజ ను ఎంపిక చేశారట. మైత్రీ మూవీమేకర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవితేజ భారీగానే డిమాండ్ చేశారట. తన రోల్ కు గాను 20 నుండి 25 రోజుల వరకు కాల్ షీట్ అవసరం కావడం తో రూ. 10 కోట్లు డిమాండ్ చేశారట. ఆయన అడిగిన దానికి నిర్మాతలు కూడా ఓకే చెప్పినట్లు సమాచారం.
కేవలం అతిథి పాత్రకే రవితేజ 10 కోట్లు డిమాండ్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వైజాగ్ షిప్ హార్బర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీలో చిరంజీవి అంగర్ కవర్ కాప్ గా షాకింగ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. ఇక ఈ మూవీ తో పాటు మోహన్ రాజా డైరెక్షన్లో గాడ్ ఫాదర్ మూవీ చేస్తున్నాడు. ఇందులో సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్ర చేస్తున్నాడు.