Homeటాప్ స్టోరీస్డాన్ శీను..బలుపు.. మరీ ఈ సారి ఏంటిదో?

డాన్ శీను..బలుపు.. మరీ ఈ సారి ఏంటిదో?

డాన్ శీను..బలుపు.. మరీ ఈ సారి ఏంటిదో?
డాన్ శీను..బలుపు.. మరీ ఈ సారి ఏంటిదో?

‘మాస్ మహారాజ్ రవితేజ’ టాలీవుడ్ లో మాస్ ఆడియన్స్ ని బాగా గ్రిప్ లో పెట్టుకున్నాడు. తీసే ప్రతి సినిమాలో కామెడీ, యాక్షన్, రొమాన్స్, మాస్ మాసాల, హీరోయిన్ ని టార్చర్ పెడుతూ సాగే పాటలు. ఇలా అన్ని సమపాళ్లలో ఉండేలా చేసుకున్నాడు. ఒకరకంగా చూసుకుంటే 2000 – 2011 సంవత్సరానికి ఒక హిట్ ఉండేలా చూసుకున్నాడు. అదే విధంగా మూస కథలనే చేస్తున్నాడు అని పేరు కూడా వచ్చింది. తర్వాత కథ అడ్డం తిరిగి ఫ్లాప్స్ వచ్చి వరించాయి మాస్ మహారాజ్ ని.

అయితే 2011 లో విడుదల అయిన ‘డాన్ శీను’ సినిమా రవితేజ కేరీర్ ని బాగా మలుపు తిప్పింది, దర్శకుడు ‘గోపీచంద్ మలినేని‘ రవితేజ గత సినిమాలని చూసి వాటికంటే బెటర్ గా చేద్దాం అని చెప్పి, రవితేజని ఒప్పించి సినిమా తీసి హిట్ కొట్టాడు. తర్వాత కూడా వరుస పరాజయాల మధ్య ఉన్న తరుణంలో కూడా రవితేజకి గారికి ‘బలుపు’ కథ చెప్పి ఇంకొక హిట్ సినిమాని ని అందించాడు.

- Advertisement -

అయితే మలినేని గారికి రవితేజని ఎప్పటికప్పుడు డిఫరెంట్ గా చూపించాలి అని చెప్పేవారు చాలా ఇంటర్వూస్ లో. అయితే గత సంవత్సరం కూడా ‘టచ్ చేసి చూడు’, ‘నెల టికెట్’, ‘అమర్ అక్బర్ ఆంథోనీ’ సినిమాలు పరాజయం అయినప్పుడు ముందు వెళ్లి కథ చెప్పాలనుకున్నాడు. కానీ ఈ లోపు ‘వి.ఐ. ఆనంద్’ తో చేస్తున్న ‘డిస్కో రాజా’ విషయం తెలిసి కొంచెం గ్యాప్ తీసుకున్నాడు.

షూటింగ్ బిజీ లో ఉన్నప్పుడు కూడా మలినేని గారు రవితేజకి ఒక పోలీస్ ఆఫీసర్ సస్పెన్స్ స్టోరీ ని చెప్పారంటా, అది బాగా నచ్చి తర్వాత ఇది చేద్దాం అని చెప్పి ఆ కథనే ఒకే చేసేశారంటా. మధ్యలో ‘అజయ్ భూపతి’ వచ్చి చెప్పిన కథ నచ్చినప్పటికీ అజయ్ చేసిన తీరు నచ్చక ఆ సినిమాని ఆపెయ్యడంతో ఇక నెక్స్ట్ సినిమా అందరూ మలినేని గారితోనే ఉంటుంది అని అనుకుంటున్నారు.

అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఇంకొక వార్త బయటికి వచ్చింది. ఇందులో రవితేజ గారు ‘ఒంగోలు’ ఏరియా లో ‘పోలీస్ ఆఫీసర్’ గా కనిపిస్తారంటా, ఒంగోలు లో జరిగే అక్రమాలని చెరిపే అధికారిగా ఉంటూ అతనికి వచ్చిన అనుకోని ఆపదనుండి ఎలా బయటపడ్డాడో అన్నది కథ అంటా. ఇలా ఆ కథ సస్పెన్స్ థ్రిల్లర్ లాగ సాగుతుంది అని అంటున్నారు. చూద్దాం మరి వీళ్ళ కాంబినేషన్ “హ్యాట్రిక్ హిట్” అవుతుందో లేదో?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All