
మాస్ మహారాజా వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్నాడు. ఈ క్రమంలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కేవలం హీరోగానే కాకుండా…కథ బాగుంటే వేరే హీరోలతో కలిసి నటించేందుకు ఓకే చెపుతున్నాడట. ఇప్పటికే పలువురు నిర్మాతలకు , దర్శకులకు చెప్పాడట. అలాంటి కథలు వస్తే తప్పకుండా చేస్తానని అంటున్నాడట. ఇప్పటికే మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ మూవీ లో ఓ కీలక రోల్ చేస్తున్నాడు. మరి రవితేజ ముందుగా ఏ స్టార్ హీరో తో మల్టీస్టారర్ మూవీ చేస్తాడో చూడాలి.
అసిస్టెంట్ డైరెక్టర్ గా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన రవితేజ.. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా, స్టార్ హీరోగా, మాస్ మహారాజాగా ఎదిగిన తీరు ఎంతమందికి స్ఫూర్తిదాయకం. మధ్యలో రవితేజ గ్రాఫ్ పడిపోయినా, ఎన్ని ప్లాప్స్ వచ్చినా ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం రవితేజ చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో రవితేజ సపోర్టింగ్ రోల్ చేసేందుకు ఓకే చెప్పడం అందర్నీ షాక్ కు గురి చేస్తుంది.