
ఫ్లపులు పలకరించినప్పుడు హిట్టు కోసం దర్శకులు, హీరోలు తన పంథాకు భిన్నంగా వెళుతుంటారు. కానీ రవిబాబు మాత్రం తన ఓల్డ్ ఫార్మాట్‌నే నమ్ముకున్నట్టు కనిపిస్తోంది. తొలి నాళ్లలో రవిబాబు ఏ పంథాని అనుపరించి సినిమాలు చేసేవాడో తన తాజా చిత్రం `క్రష్`కి కూడా అదే ఫార్మాట్‌ని నమ్ముకున్నట్టున్నాడు. పైగా బూతు, వల్గర్ చిత్రాలకు, కంటెంట్‌కు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్న ఈ వేళ ఫక్లు అదే తరహా కథని నమ్ముకుని తాజా చిత్రాన్ని తెరకెక్కించినట్టు తెలుస్తోంది.
రవిబాబు వరుస ఫ్లాపుల తరువాత చేస్తున్న చిత్రం `క్రష్`. అంతా కొత్త వారితో ఎలాంటి రిస్ట్రెక్షన్స్ లేకుండా సెన్సార్ వుందనే బాదబందీ లేకుండా యధేశ్చగా డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో ఈ చిత్రాన్ని నింపేసినట్టు కనిపిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ని ఫస్ట్ పిప్ పేరుతో గురువారం రిలీజ్ చేశారు. టీజర్ నిండా బూతు డైలాగ్‌లే. యువతని టార్గెట్ చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు కనిపిస్తోంది.
టైటిల్‌కి తగ్గట్టే ఈ సినిమా యూత్‌ని ఓ రేంజ్‌లో క్రష్ చేసేలా వుంది. రవిబాబు డైరెక్ట్ చేస్తూ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీ కోసమే సిద్ధం చేసినట్టుగా కనిపిస్తోంది. రవిబాబు సినిమాల్లో బూతు డైలాగ్స్‌తో వస్తున్న తొలి సినిమా ఇదే కావడంతో యూత్ అంతా ఈ మూవీపై ఆసక్తిని చూపిస్తున్నారు.