
వరుస సినిమాలతో బిజీ గా ఉన్న శ్రీవల్లీ రష్మిక..తాజాగా యంగ్ హీరో రామ్ కు ఓకే చెప్పిందా..? ప్రస్తుతం ఫిలిం సర్కిల్లో ఇదే చర్చ గా మారింది. ఇస్మార్ట్ శంకర్ మూవీ తో సూపర్ హిట్ అందుకున్న రామ్..ఆ తర్వాత రెడ్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్లాప్ అందుకున్నాడు. ప్రస్తుతమ్ లింగుస్వామి డైరెక్షన్లో ది వారియర్ అనే మూవీ చేస్తున్నాడు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ తెలుగు , తమిళ్ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను డైరెక్షన్లో మాస్ ఎంటర్టైనర్ లో నటించబోతున్నాడు. ఈ సినిమాలో రామ్ కు జోడిగా రష్మిక ను అనుకుంటున్నారట బోయపాటి.
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల మీద దృష్టి పెట్టిన బోయపాటి శ్రీను సినిమాలో నటీనటులను ఫైనల్ చేసే పనిలో పడ్డారు. అందులో భాగంగా ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక నటిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డట్లు సమాచారం. ఇప్పటికే రష్మికకు కథ చెప్పగా, ఆమె సూచనప్రాయంగా అంగీకారం తెలిపిందని, త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ మీద శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ సినిమా రామ్ కి 20వ సినిమా కావడం విశేషం. ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.