Homeటాప్ స్టోరీస్న‌న్ను భ‌య‌పెట్టేవి అవే: ర‌ష్మిక మంద‌న్న‌

న‌న్ను భ‌య‌పెట్టేవి అవే: ర‌ష్మిక మంద‌న్న‌

న‌న్ను భ‌య‌పెట్టేవి అవే: ర‌ష్మిక మంద‌న్న‌
న‌న్ను భ‌య‌పెట్టేవి అవే: ర‌ష్మిక మంద‌న్న‌

`ఛ‌లో` చిత్రంతో టాలీవుడ్‌లోకి తెరంగేట్రం చేసిన క‌న్న‌డ సోయ‌గం రష్మిక మంద‌న్న. వ‌రుస విజ‌యాల‌తో టాలీవుడ్‌లో అన‌తి కాలంలోనే స్టార్‌డమ్ ని సొంతం చేసుకుంది. త‌న‌దైన చ‌రిష్మాతో స్టార్ హీరోయిన్‌ల జాబితాలో చేరిపోయింది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో చేసిన `గీత గోవిందం` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచి ర‌ష్మిక‌ని స్టార్ హీరోయిన్ గా నిల‌బెట్టింది. ఇదే ఊపులో గతేడాది విడుదలైన `సరిలేరు నీకెవ్వ‌రు` కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌డంతో ర‌ష్మిక‌ టాప్ హీరోయిన్ల లీగ్‌లోకి చేరిపోయింది.

హీరోయిన్‌గా భారీ క్రేజ్‌ని సొంతం చేసుకున్న ర‌ష్మిక సోష‌ల్ మీడియా ట్విట్టర్లో అభిమానులకు నిత్యం అందుబాటులో వుంటోంది. తాజాగా అభిమానుల‌తో జ‌రిపిన‌ ఇంటరాక్షన్ లో రష్మిక తనని సాధారణంగా భయపెట్టే విషయాల గురించి వెల్లడించింది. సరీసృపాలు (పాములు), అత్యంత‌ చీకటిగా వుండే ప్రదేశాలంటే ఎక్కువ‌గా భయపడ‌తాన‌ని వెల్ల‌డించింది.

- Advertisement -

ఒక అభిమాని మిమ్మ‌ల్ని భయపెట్టే విషయాల గురించి చెప్ప‌మ‌ని అడిగితే రష్మిక ఈ విధంగా స్పందించింది.  రష్మిక మంద‌న్న ప్రస్తుతం అల్లు అర్జున్ `పుష్ప`తో పాటు కార్తితో క‌లిసి న‌టిస్తున్న `సుల్తాన్‌` చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నారు. ఈ ఏడాదే రష్మిక బాలీవుడ్‌కు వెళుతున్న విష‌యం తెలిసిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All