
కన్నడ భామ రష్మిక మందన్న తాజాగా తాను నటిస్తున్న చిత్రంలోని టైటిల్ ని లీక్ చేసింది తనకు తెలియకుండానే . తాజాగా తమిళంలో కార్తీ హీరోగా నటిస్తున్న చిత్రంలో రష్మిక మందన్న ని హీరోయిన్ గా ఎంపిక చేసారు . ఆ షూటింగ్ లో పాల్గొంటోంది కూడా . అయితే కార్తీ – రష్మిక జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ పెట్టలేదు కానీ టైటిల్ పెట్టే పనిలో ఉన్నారు ఆ చిత్ర బృందం .
ఇంకేముంది ఆ టైటిల్ ని అధికారికంగా ప్రకటించకుండానే తాను ట్వీట్ చేసి పెద్ద తప్పు చేసింది . ఇంతకీ కార్తీ – రష్మిక మందన్న లు జంటగా నటిస్తున్న చిత్రానికి పెట్టనున్న టైటిల్ ఏంటో తెలుసా …… ” సుల్తాన్ ” . తెలుగులో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సుల్తాన్ కు దీనికి సంబంధం లేదు కానీ బాలయ్య నటించిన సుల్తాన్ అంతగా ఆడలేదు మరి .
అయితే అదే టైటిల్ ని ఇప్పుడు కార్తీ తన సినిమాకు పెట్టనున్నట్లు తెలుస్తోంది . తెలుగులో ఇటీవలే డియర్ కామ్రేడ్ అంటూ వచ్చిన ఈ భామ ప్లాప్ చవిచూసింది . తాజాగా మహేష్ బాబు తో కూడా నటిస్తోంది సరిలేరు నీకెవ్వరు చిత్రంలో . కార్తీ కి గతకొంత కాలంగా కాలం కలిసి రావడం లేదు చేస్తున్న సినిమాలన్నీ ప్లాప్ అవుతూనే ఉన్నాయి పాపం .