Tuesday, March 21, 2023
Homeటాప్ స్టోరీస్రష్మిక ని ఏడిపించిన దర్శకుడు

రష్మిక ని ఏడిపించిన దర్శకుడు

rashmika mandanna crying in geetha govindam setఛలో , గీత గోవిందం చిత్రాలతో తెలుగునాట క్రేజీ హీరోయిన్ గా అవతరించింది రష్మిక మందన్న . అయితే రష్మిక మందన్న ని ఓ దర్శకుడు ఏడిపించాడట ! అతడి చేష్టల వల్ల కళ్ళల్లో నీళ్ళు తిరిగాయని సంచలన వ్యాఖ్యలు చేసింది రష్మిక . ఇంతకీ ఇంతటి అందాల ముద్దుగుమ్మ ని ఏడిపించిన దర్శకుడు ఎవరో తెలుసా ……. గీత గోవిందం దర్శకుడు పరశురాం . అవును పరశురాం రష్మిక ని ఏడిపించాడట ! ఈ విషయాన్నీ రష్మిక చెబుతోంది . అయితే పరశురాం ఏడిపించిన మాట నిజమే కానీ అది కావాలని చేసిన పని కాదు సరదాగా చేసిన పని అన్నమాట .

- Advertisement -

ఒకరోజు రష్మిక షూటింగ్ కి వచ్చిన సందర్భంలో ఒక్కరు కూడా ఆమెతో మాట్లాడొద్దని ఆర్డర్ వేసాడట పరశురాం . గీత గోవిందం చిత్ర దర్శకుడు కాబట్టి సెట్ లో రష్మిక రాగానే ఒక్కరు కూడా పలకరించలేదట ! అంతేకాదు ఆమె పలువుర్ని పలకరించినప్పటికి వాళ్ళు విష్ చేయకపోవడంతో అవమానంగా భావించి పక్కకు వెళ్లి వెక్కి వెక్కి ఏడుస్తోందట సరిగ్గా అదే సమయంలో పరశురాం వచ్చి రష్మిక ని అనునయించి కేవలం సరదా కోసమే ఇలా చేసాం అంతకు మించి ఏమి లేదని అన్నాడట దాంతో కన్నీళ్ళ స్థానంలో ఆనంద బాష్పాలు వచ్చాయి రష్మిక కు .

English Title: rashmika mandanna crying in geetha govindam set

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts