
“మేము ఊపుకుంటూ డ్యాన్సులు వెయ్యడం మీకు నచ్చకపోతే మీరు కళ్ళు మూసుకోవచ్చు. లేదా చానెల్ మార్చుకోండి. అంతే తప్ప బలవంతంగా ఎవడూ మీ చేతులు, కాళ్ళు కట్టేసి కూర్చోపెట్టలేదు కదా.! కనీస మర్యాద తెలియదా..!. మీరు డబ్బులు పెట్టి సినిమాలు తీసినప్పుడు నాకు “సతీ సావిత్రి” క్యారెక్టర్ ఇవ్వండి. చేస్తా..! మేము ఇక్కడ జనాలకు ఏది కావాలో అదే ఇస్తున్నాం. డిమాండ్ అండ్ సప్లయ్. జబర్దస్త్ షో నూ కరోనా వైరస్ అంత దారుణంగా పోలుస్తున్నారు ఎందుకు..?” అంటూ జబర్దస్త్ యాంకర్ రష్మీ నెటిజన్స్ పై సీరియస్ అయ్యారు.
ఎంతో కాలంగా యాంకర్ రష్మీ పై కొందరు నెటిజన్స్ టార్గెట్ చెయ్యడం, వల్గర్ కామెంట్లు పెట్టడం లాంటివి చేస్తున్నారు. ఇక షోలో కూడా మొదటినుండి యాంకర్ రష్మీ వయసు గురించి, ఆమెకు తెలుగు రాదు.. అనీ, సుధీర్ & శేఖర్ మాస్టర్ తో అఫైర్స్ గురించి జనాలు ట్రోల్ చెయ్యడం తెలిసిందే.! కానీ కొన్నిసార్లు జనాలు మరీ అతిగా శృతి మించి అసభ్య పదజాలం వాడటం కనిపిస్తోంది. ఇది ఆమె ఒక్కదానికే ఉన్న సమస్య కాదు. మీడియా మరియు ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో ఉన్న దాదాపు అందరిని అసభ్యంగా కామెంట్ లు పెట్టడం, ఫోటోలు మార్ఫింగ్ చెయ్యడం లాంటి పనులు చేస్తున్నారు కొంతమంది. చట్టపరంగా ఇది నేరం అయినా…. సరైన నియంత్రణ, పర్యవేక్షణ లేక ఈ న్యూసెన్స్ కంట్రోల్ అవ్వడం లేదు.
టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉండటం,ముఖ్యంగా 15 – 25 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు అతిగా స్మార్ట్ ఫోన్లు వాడటం, వారిపై పేరెంట్స్ నియంత్రణ లేకపోవడం ఇలా అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పటికైనా ఇలాంటి ఆకతాయిల పై కఠిన చర్యలు తీసుకోవాలి.