Homeటాప్ స్టోరీస్రాశి ఖన్నా తెలుగులో సినిమాలు ఎందుకు చేయట్లేదో చెప్పేసింది

రాశి ఖన్నా తెలుగులో సినిమాలు ఎందుకు చేయట్లేదో చెప్పేసింది

రాశి ఖన్నా తెలుగులో సినిమాలు ఎందుకు చేయట్లేదో చెప్పేసింది
రాశి ఖన్నా తెలుగులో సినిమాలు ఎందుకు చేయట్లేదో చెప్పేసింది

ఊహలు గుసగుసలాడే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన భామ రాశి ఖన్నా. తన బబ్లీ లుక్స్, క్యూట్ యాక్టింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించిన రాశి ఖన్నా చాలా త్వరగానే రేసులోకి వచ్చేసింది. అయితే మొదట్లో హిట్స్ వచ్చినా వెనువెంటనే వచ్చే ప్లాప్స్ తో ఆమె టాప్ స్థానాన్ని కైవసం చేసుకోలేకపోయింది. గతేడాది వెంకీ మామ, ప్రతిరోజూ పండగే వారం రోజుల వ్యవధిలో రిలీజవ్వడమే కాకుండా రెండూ కూడా సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఈ రెండిట్లో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది. దీంతో మళ్ళీ తెలుగులో ఆమెకు అవకాశాల వెల్లువ ఉంటుందని అందరూ భావించారు.

కానీ ఈ ఏడాది విజయ్ దేవరకొండ హీరోగా చేసిన వరల్డ్ ఫేమస్ లవర్ ప్లాపవ్వడమే కాకుండా రాశి ఖన్నా పోషించిన పాత్రకు విమర్శలు వచ్చిన సంగతి తెల్సిందే. దీనిపై రాశి ఖన్నా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది కూడా. రాశి ఖన్నా అభిమానులకు ఆమె అలాంటి పాత్రలు చేయడం నచ్చలేదు. వరల్డ్ ఫేమస్ లవర్ తర్వాత తెలుగులో ఎటువంటి సినిమాలు ఒప్పుకోలేదు రాశి ఖన్నా. దీనిపై పలు రకాల వార్తలు వచ్చాయి కూడా. అయినా కూడా రాశి ఖన్నా నుండి ఎటువంటి స్పందనా లేదు.

- Advertisement -

రీసెంట్ గా ఈమె అభిమానులతో ఆన్లైన్ లో ముచ్చటించింది. అభిమానుల నుండి వచ్చిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. తమిళంలో రెండు ప్రాజెక్టులు చేస్తున్నట్లు రివీల్ చేసింది. హరి దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కబోయే యాక్షన్ ఎంటర్టైనర్ లో హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలియజేసింది రాశి ఖన్నా. అలాగే సుందర్ సి దర్శకత్వంలో రాబోయే అరణ్మణై మూడవ పార్ట్ లో హీరోయిన్ గా సెలక్ట్ అయినట్లు కూడా తెలియజేసింది.

ఇక తెలుగులో సినిమాలు ఎందుకని ఒప్పుకోవట్లేదు అన్న ప్రశ్నకు ప్రస్తుతం రెండు ప్రాజెక్టులు డిస్కషన్ స్టేజి లో ఉన్నాయని, లాక్ డౌన్ పూర్తయ్యాక వీటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయని తెలిపింది రాశి ఖన్నా.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All