Homeటాప్ స్టోరీస్పవన్ ఫ్యాన్స్ కు ఊపు తెప్పించే న్యూస్ చెప్పిన థమన్

పవన్ ఫ్యాన్స్ కు ఊపు తెప్పించే న్యూస్ చెప్పిన థమన్

Rap Song from Bheemla Nayak
Rap Song from Bheemla Nayak

మ్యూజిక్ డైరెక్టర్ థమన్ జోష్ మాములుగా లేదు. ఆయన ఏ సినిమా కు మ్యూజిక్ చేసిన అది బ్లాక్ బస్టర్ అవుతుంది..ఆ సినిమా విజయంలో థమన్ మ్యూజిక్ కీలకభాగం అవుతుండడం తో అగ్ర హీరోలంతా కూడా థమన్ నే ఎంపిక చేసుకుంటున్నారు. రీసెంట్ గా భీమ్లా నాయక్ తో మరో మ్యూజికల్ బ్లాక్ బస్టర్ అందుకున్న థమన్..పవన్ అభిమానుల్లో ఉత్సహం నింపే అప్డేట్ ఇచ్చారు. త్వరలో ‘భీమ్లా నాయక్’ సినిమా నుంచి ర్యాప్ సాంగ్ రాబోతుందని తెలిపాడు.

సినిమా విడుదలైన తర్వాత..వాటికీ హైప్ తీసుకురావడానికి ఆ సినిమాకి సంబంధించిన సీన్స్ లేదా పాటలు సినిమాలో జత చేయడం కానీ విడిగా యూట్యూబ్ లో రిలీజ్ చేయడం కానీ చేస్తారు. తాజాగా ‘భీమ్లా నాయక్’ నుండి అలాంటి ర్యాప్ సాంగ్ ను విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్నీ థమన్ ట్విట్టర్ ద్వారా తెలుపుతూ.. ”భీమ్లా నాయక్ ఇంకా డ్యూటీలోనే ఉన్నాడు. త్వరలో ర్యాప్ సాంగ్ రాబోతుంది. బాణాసంచా కాల్చేందుకు రెడీగా ఉండండి” అంటూ పోస్ట్ చేసాడు. ఈ పోస్ట్ తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

- Advertisement -

పవన్ కళ్యాణ్ – రానా కలయికలో మాస్ ఎంటర్టైనర్ గా ఫిబ్రవరి 25 న భీమ్లా నాయక్ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేస్తుంది. ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేయగా , త్రివిక్రమ్ మాటలు , స్క్రీన్ ప్లే అందించారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ఫై నాగవంశీ నిర్మించారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All