
రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్ , రామ్ చరణ్ లు హీరోలు గా నటించిన ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) భారీ అంచనాల మధ్య శుక్రవారం వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాహుబలి సినిమా తో తెలుగు సినిమా సత్తా చాటిన రాజమౌళి , ఆర్ఆర్ఆర్ తో మరోసారి తెలుగు సినిమా స్థాయి ఏంటో చూపించారు. ఈ మూవీ రిలీజ్ తర్వాత ప్రతి ఒక్కరు రాజమౌళి ప్రతిభ ఫై , ఎన్టీఆర్ , రామ్ చరణ్ నటన ఫై ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఇక చిత్ర సీమలో అయితే ప్రతి ఒక్కరు సినిమా కు జై జై లు కొడుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు , హీరోలు, దర్శకులు , నిర్మాతలు సినిమా ఫై ప్రశంసలు జల్లు కురిపించగా..తాజాగా బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
‘ఆర్ఆర్ఆర్’ సినిమా హాలీవుడ్ సినిమాలను కూడా బీట్ చేసేసి దూసుకెళ్తుంది. ఇది నిజంగా ఎంతో గర్వంగా అనిపిస్తుంది. రాజమౌళి ఇలాంటి అద్భుతమైన సినిమాలతో మన భారతీయ చిత్ర పరిశ్రమకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొస్తున్నారు. ఇది మనమందరం సంతోషించదగ్గ విషయం’ అని తెలిపాడు. అక్కడితో ఆగకుండా ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ను తెలుగులో పాడి ఆకట్టుకున్నాడు రణ్‌వీర్.