Homeటాప్ స్టోరీస్రంగస్థలం రివ్యూ

రంగస్థలం రివ్యూ

rangasthalam movie reviewనటీనటులు : రాంచరణ్ , సమంత , ఆది , ప్రకాష్ రాజ్ , జగపతిబాబు తదితరులు
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
నిర్మాతలు : నవీన్ , వై . రవిశంకర్ , మోహన్
దర్శకత్వం : సుకుమార్
రిలీజ్ డేట్ : 30 మార్చి 2018
రేటింగ్     :3.25/5

 

- Advertisement -

 

 

1980 నాటి కథతో రంగస్థలం చిత్రం తెరకెక్కుతోంది అనగానే ఈ రంగస్థలం పై ఆసక్తి నెలకొంది దానికి తగ్గట్లుగా చరణ్ లుక్ ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచింది . సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీస్ సంస్థ నిర్మించిన రంగస్థలం చిత్రం ఈరోజు విడుదల అయ్యింది . మరి ఈ చిత్రం అంచనాలకు తగ్గట్లుగా ఉందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .

కథ :

సౌండ్ ఇంజనీర్ ( వినికిడి లోపం అన్నమాట ) అయిన చిట్టిబాబు (రాంచరణ్ ) రంగస్థలం అనే గ్రామంలో ఎవరి పొలానికి నీళ్లు పెట్టాలన్నా ఈ సౌండ్ ఇంజనీర్ నే ఆశ్రయిస్తుంటారు . అయితే ఈ చిట్టిబాబు రామలక్ష్మి (సమంత ) ని చూడగానే మొదటి చూపులోనే ప్రేమిస్తాడు . దుబాయ్ నుండి చిట్టిబాబు అన్న కుమార్ బాబు (ఆది పినిశెట్టి ) రంగస్థలం గ్రామానికి వస్తాడు . అక్కడ ముప్పై ఏళ్లుగా ప్రెసిడెంట్ గా ఎన్నిక అవుతూ ఎదురు తిరిగిన వాళ్ళని చంపేస్తూ అధికారం వెలగ బెడుతుంటాడు ఫనీంద్ర భూపతి ( జగపతి బాబు ). ఊళ్ళో అక్రమాలకు కారణం ప్రెసిడెంట్ అని భావించిన కుమార్ బాబు అతడికి పోటీగా ప్రెసిడెంట్ గా పోటీ చేస్తాడు . తనకు వ్యతిరేకంగా కుమార్ బాబు పోటీ చేయడంతో అతడ్ని ,చిట్టిబాబు కుటుంబాన్ని ప్రెసిడెంట్ ఎలాంటి ఇబ్బందులకు గురి చేసాడు ……. చిట్టిబాబు దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు ? చివరకు ఏమైంది అన్నది తెలియాలంటే రంగస్థలం చిత్రాన్ని చూడాల్సిందే .

హైలెట్స్ :

రాంచరణ్ అద్భుత నటన
సమంత
జగపతి బాబు
ఛాయాగ్రహణం
ఆర్ట్ డైరెక్టర్
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం
సుకుమార్ దర్శకత్వ ప్రతిభ
మైత్రి మూవీస్ నిర్మాణ విలువలు

డ్రా బ్యాక్స్ :

సినిమా నిడివి ఎక్కువగా ఉండటం

పూజా హెగ్డే ఐటెం సాంగ్

నటీనటుల ప్రతిభ :

రాంచరణ్ కెరీర్ లో అద్భుతమైన నటన ని కనబరిచిన చిత్రం ఈ రంగస్థలం . చెవిటివాడిగా , అమాయకుడిగా , ప్రేమికుడిగా , అన్న పట్ల అనుబంధాన్ని చూపించే తమ్ముడిగా , రౌద్రాన్ని ఓవరాల్ గా అన్ని రకాల ఎమోషన్స్ ని ఒక్క చిట్టిబాబు లో చూపించి విమర్శకుల చేత కూడా శెభాష్ అనిపించుకున్నాడు రాంచరణ్ . సుకుమార్ రాసుకున్న క్యారెక్టర్ కి నూటికి నూరుపాళ్లు న్యాయం చేసి చరణ్ కమర్షియల్ హీరోగానే కాకుండా నటుడిగా తన సత్తా ఏంటో చూపించాడు . ఇక సమంత గ్రామీణ యువతిగా , చిట్టిబాబు ప్రియురాలిగా అద్భుతంగా నటించింది . చరణ్ – సమంత ల మధ్య కెమిస్ట్రీ కూడా బాగా సెట్ అయ్యింది . ఆది పినిశెట్టి కి మంచి పాత్ర లభించింది , దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు అలాగే విలన్ గా జగపతిబాబు మరోసారి రాణించాడు . ప్రకాష్ రాజ్ పాత్ర అనూహ్యంగా ఉంది . అలాగే అనసూయ కు కూడా మంచి పాత్రే లభించింది రంగమ్మత్త గా తనని తానూ ప్రూవ్ చేసుకుంది . ఇక మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమతమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేసారు .

సాంకేతిక వర్గం :

మైత్రి మూవీస్ సంస్థ భారీగా ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు . రత్నవేలు ఛాయాగ్రహణం ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది . గోదావరి అందాలను అలాగే 80 నాటి కాలాన్ని యధాతధంగా చూపించి మెప్పించాడు . దేవిశ్రీ ప్రసాద్ పాటలు అలాగే నేపథ్య సంగీతం ఈ చిత్రానికి మరో హైలెట్ గా నిలిచింది . రంగస్థలం సెట్ ని అద్భుతంగా రూపొందించిన ఆర్ట్ డైరెక్టర్స్ ని ఎంతగా అభినందించినా తక్కువే ! అప్పటి రోజులను తలపించేలా సెట్ ని రూపొందించి భేష్ అనిపించారు . ఎడిటర్ విషయానికి వస్తే …… కత్తెర ని పూర్తిస్థాయిలో వినియోగించలేదు దానికి సుకుమార్ కారణం అనుకుంటా కానీ మరో ఇరవై నిమిషాల సినిమా కట్ చేసి ఉంటే మరింతగా బాగుండేది . ఇక దర్శకులు సుకుమార్ విషయానికి వస్తే ……. కథ , కథనం ని సరిగ్గా అల్లుకోవడమే కాకుండా దానికి తగ్గట్లుగా నటీనటులను ఎంచుకొని వాళ్ళ నుండి సరైన నటన రాబట్టుకొని పూర్తిస్థాయిలో సక్సెస్ అయ్యాడు . అయితే సినిమా నిడివి ఇంకాస్త తగ్గించి ఉంటే ఖచ్చితంగా ఇంకా బాగుండేది .

ఓవరాల్ గా :

రాంచరణ్ అద్భుత నటన , సుకుమార్ టేకింగ్ వెరసి రంగస్థలం తప్పకుండా చూడాల్సిన సినిమా

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All