Homeటాప్ స్టోరీస్రంగస్థలం 3 రోజుల వసూళ్లు

రంగస్థలం 3 రోజుల వసూళ్లు

rangasthalam 3 days collectionsరాంచరణ్ రంగస్థలం చిత్రంతో బాక్సాఫీస్ ని కుమ్మేస్తున్నాడు . మార్చి 30న విడుదలైన రంగస్థలం భారీ వసూళ్ల ని సాధిస్తోంది . మొత్తంగా మూడు రోజుల్లో 88 కోట్లు కలెక్ట్ చేసి ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది రంగస్థలం చిత్రం . ఓవర్ సీస్ లో కూడా భారీ కలెక్షన్ల ని సాధిస్తోంది ఈ చిత్రం . రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా , రెస్ట్ ఆఫ్ ఇండియా , ఓవర్ సీస్ అన్ని కలుపుకొని మూడు రోజుల్లో 88 కోట్లు వసూల్ కాగా 50 కోట్ల కు పైగా షేర్ వచ్చింది దాంతో బయ్యర్లు కూడా సంతోషంగా ఉన్నారు .

రంగస్థలం చిత్రానికి 75 కోట్ల బడ్జెట్ అయ్యింది కాగా క్రేజ్ రావడంతో మంచి బిజినెస్ జరిగింది . సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో రంగస్థలం చిత్రాన్ని నిర్మించగా చరణ్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ని సాధించాడు . చరణ్ తో పాటుగా సమంత కు అనసూయ కు మంచి పేరు వస్తోంది పెర్ఫార్మెన్స్ పరంగా .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All