Homeటాప్ స్టోరీస్2 రోజుల్లో 80 కోట్లు సాధించిన రంగస్థలం

2 రోజుల్లో 80 కోట్లు సాధించిన రంగస్థలం

rangasthalam 2 days world wide collectionsరెండు రోజుల్లో 80 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించింది రంగస్థలం చిత్రం అంటూ ట్వీట్ చేసాడు సినీ విమర్శకుడు ఉమైర్ సందు . మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన రంగస్థలం చిత్రానికి మొదటి నుండి పాజిటివ్ టాక్ ఉంది దానికి తోడు పాటలు కూడా సూపర్ హిట్ కావడంతో అంచనాలు పెరిగాయి అందుకు తగ్గట్లుగానే చరణ్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించాడు . మొదటి రోజున ప్రపంచ వ్యాప్తంగా 46 కోట్ల వసూళ్ల ని సాధించగా రెండో రోజు కూడా అదే ఊపు కొనసాగింది .

టాక్ బాగుండటంతో నిన్న 34 కోట్ల వరకు వసూల్ చేసినట్లు తెలుస్తోంది దాంతో మొత్తంగా 80 కోట్ల గ్రాస్ వచ్చినట్లైంది . అయితే ఇది గ్రాస్ మాత్రమే ! నిర్మాతలు , బయ్యర్లు లాభాలలోకి రావాలంటే 150 కోట్లకు పైగా వసూల్ కావాలి . చరణ్ అభినయం , సుకుమార్ టేకింగ్ , దేవిశ్రీ సంగీతం , మైత్రి మూవీస్ నిర్మాణం వెరసి రంగస్థలం ని హిట్ చేసాయి అయితే సినిమా నిడివి ఎక్కువ ఉండటంతో ప్రేక్షకులు అసహనానికి గురౌతున్నారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All