Homeటాప్ స్టోరీస్`రంగ్ దే` మూవీ రివ్యూ

`రంగ్ దే` మూవీ రివ్యూ

Rang De Movie Telugu Review
Rang De Movie Telugu Review

న‌టీన‌టులు :  నితిన్‌, కీర్తి సురేష్‌, న‌రేష్‌, కౌల‌స్య‌, రోహిణి, బ్ర‌హ్మాజీ, వెన్నెల కిషోర్‌, అభిన‌వ్ గోమ‌ఠం, సుహాస్‌, వినీత్‌, స‌త్యం రాజేష్ త‌దిత‌రులు న‌టించారు.
ద‌ర్శ‌క‌త్వం :  వెంకీ అట్లూరి
ర‌చ‌న‌:  వెంకీ అట్లూరి, పి. స‌తీష్ చంద్ర‌
సంగీతం:  దేవిశ్రీ‌ప్ర‌సాద్‌
సినిమాటోగ్ర‌ఫీ :  పీసీ శ్రీ‌రామ్‌
ఎడిటంగ్‌: న‌వీన్ నూలి
రిలీజ్ డేట్ : 26 -03- 21
రేటింగ్ : 2.75/5

హీరో నితిన్ వ‌రుస‌గా ప్రేమ‌క‌థా చిత్రాల‌తో ఆక‌ట్టుకుంటున్నారు. `భీష్మ‌` చిత్రం హిట్‌తో గ‌త ఏడాది మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చిన నితిన్ మ‌రోసారి రొమాంటిక్ ల‌వ్‌స్టోరీ `రంగ్ దే`తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. ఇదే నా ఆఖ‌రి ప్రేమ‌క‌థ అవుంద‌ని ఈ మూవీ ప్ర‌చారంలో ప‌దే ప‌దే చెబుతూ వ‌చ్చిన నితిన్ ప్రేమ‌క‌థ‌ల‌పై మంచి ప‌ట్టున్న వెంకీ అట్లూరిలో చేసిన ఈ సినిమా ఆశించిన స్థాయిలోనే ఆక‌ట్టుకుందా? `మ‌హాన‌టి` త‌రువాత నుంచి మ‌హిళా ప్ర‌ధాన చిత్రాల్లో న‌టిస్తూ వ‌స్తున్న కీర్తిసురేష్ ఈ మూవీలో ఏ స్థాయిలో ఆక‌ట్టుకుంది. అన్న‌ది తెలియాలంటే క‌థ‌లోకి వెళ్లాల్సిందే.

- Advertisement -

క‌థ‌:
అర్జున్ (నితిన్‌), అనుప‌మ (కీర్తి సురేష్‌) ప‌క‌క్క ప‌క్క ఇళ్ల‌ల్లో పెరిగారు. చిన్న త‌నం నుంచి ఒక‌రంటే ఒక‌రికి ప‌డ‌దు. కానీ క‌లిసే వుంటుంటారు. అయితే అను చ‌దువుల్లో ముందు వ‌రుస‌లో నిలుస్తుంటే  అర్జున్ మాత్రం ఇంజినీరింగ్ లో బ్యాక్‌లాగ్స్‌తో స‌త‌మ‌త‌మ‌వుతుంటాడు. దీంతో అర్జున్ తండ్రి (న‌రేష్‌) అనుని చూసి నేర్చుకో` అంటూ చివాట్లు పెడుతుంటాడు. ఆ చివాట్లు విన్న ప్ర‌తీసారి అనుపై కోపంతో ర‌గిలిపోతుంటాడు అర్జున్‌. అనుని ఒక శ‌త్రువులా చూస్తుంటాడు. అలాంటి శ‌త్రువుని అనుకోకుండా అర్జున్ పెళ్లి చేసుకోవాల్సి వ‌స్తుంది? . అనుని అర్జున్ ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వ‌చ్చింది? ఇష్టం లేని పెళ్లి త‌రువాత ఇద్ద‌రి మ‌ధ్య ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి. అన్నదే ఈ చిత్ర ప్ర‌ధాన క‌థ‌.

న‌టీన‌టుల న‌ట‌న‌:
నితిన్ – కీర్తి సురేష్‌ల జోడీ ఈ సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ఒక విధంగా చెప్పాలంటే ఈ చిత్రానికి స‌రికొత్త రంగుత‌ద్దార‌ని చెప్పొచ్చు. ఇద్ద‌రి మ‌ధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. నితిన్ అర్జున్ అనే ఇంజ‌నీరింగ్ కుర్రాడిగా క‌నిపించిన తీరు ఆక‌ట్టుకుంటుంది. ఇక అను పాత్ర‌లో కీర్తి సురేష్ ఒక విధంగా చెప్పాలంటే నితిన్‌ని ఆడుకుంద‌ని చెప్పొచ్చు. ఒక‌రిని మించి ఒక‌రు అన్న‌ట్టుగా సంద‌ర్భాన్ని బ‌ట్టి ఆడుకున్నార‌ని చెప్పాలి. కీర్తి సురేష్ గ‌తంతో పోలీస్తే మ‌రింత నాజూగ్గా క‌నిపించింది. ఇక హీరో తండ్రిగా న‌రేష్‌, త‌ల్లిగా కౌస‌ల్య‌, కీర్తి త‌ల్లిగా రోహిణి బ‌ల‌మైన పాత్ర‌ల్లో న‌టించి ఆక‌ట్టుకున్నారు. అభిన‌వ్ గోమ‌టం, వెన్నెల కిషోర్‌, సుహాస్‌, బ్ర‌హ్మాజీ న‌వ్వించారు.

సాంకేతిక నిపుణులు:
`రంగ్ దే`కి పేరుకు త‌గ్గ‌ట్టే పీసీ శ్రీ‌రామ్ త‌న కెమెరా ప‌నిత‌నంతో రంగుల‌ద్దారు. ఆయ‌న కెమెరా మాయాజాలం పాట‌ల్లో ప్ర‌త్యేకంగా క‌నిపించింది. దేవిశ్రీ‌ప్ర‌సాద్ పాట‌లు, నేప‌థ్య సంగీతం సినిమాకు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది.  సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ విలువ‌ల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఎక్క‌డా రాజీప‌డ‌లేదు. సున్నిత‌మైన భావోద్వేగాల‌తో వెంకీ అట్లూరి క‌థ‌ని చెప్పిన తీరు బాగుంది.

తీర్పు:
నితిన్‌, కీర్తి సురేష్‌ల న‌ట‌న ఈ చిత్రానికి ప్ర‌ధాన హైలైట్‌గా నిలిచింది. క‌థ‌లో కొత్త‌ద‌నం లేక‌పోయినా ఎంచుకున్న క‌థ‌ని ఎక్క‌డా బోర్ లేకుండా ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో వెంకీ అట్లూరి న‌డిపించిన తీరు, దేవిశ్రీ‌ప్ర‌సాద్ సంగీతం, పీసీ శ్రీ‌రామ్ కెమెరా మాయాజాలం ఈ చిత్రానికి ప్ర‌ధాన బ‌లంగా నిలిచాయి. కొత్త క‌థ కాక‌పోయినా ఫ్యామిలీతో చూడ‌ద‌గ్గ సినిమా ఇది.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All