
బాలీవుడ్ క్రేజీ జంట అలియా భట్ – రణబీర్ కపూర్ లు రేపు (ఏప్రిల్ 14 న) వివాహ బంధంతో ఒకటికాబోతున్నారు. ఈ పెళ్లి వేడుకకు ఆర్‌కే స్టూడియోస్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అభిమానులు తమ అభిమాన స్టార్స్ కోసం ప్రత్యేకమైన గిఫ్ట్స్ పంపుతున్నారు. తాజాగా సూరత్‌కు చెందిన ఇద్దరు అభిమానులు.. ఒక రాయల్ గిఫ్ట్‌ను పంపారు. 24 క్యారెట్ల బంగారు పూత పోసిన 125 గులాబీ పూలు పొదిగిన ఒక పుష్పగుచ్ఛాన్ని ప్రత్యేకంగా తయారు చేయించారు. ఆ ఇద్దరు అభిమానులూ బంగారం వ్యాపారులే కావడం విశేషం. బుధవారం మెహందీ వేడుక నిర్వహించారు. ఈ ప్రేమ జంటకు బిగ్‌బీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలోని లవ్ సాంగ్ ‘కేసరియా’ సాంగ్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘భవిష్యత్‌లో చాలా ప్రత్యేకమైన ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న మా ఇషా, శివకు శుభాకాంక్షలు. బ్రహ్మాస్త్ర టీమ్ నుంచి ప్రత్యేక వేడుకలు ప్రారంభిద్దాం’ అంటూ ఆ వీడియోకు జోడించారు.