Homeటాప్ స్టోరీస్ఆగస్టు 15న వస్తోన్న "రణరంగం"

ఆగస్టు 15న వస్తోన్న “రణరంగం”

ranarangam movie release date august 15 2019
ranarangam movie release date august 15 2019

శర్వానంద్ హీరోగా కాజల్ కల్యాణి ప్రియదర్శని హీరోయిన్స్ గా సుధీర్ వర్మ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై యస్.నాగవంశీ నిర్మిస్తోన్న చిత్రం “రణరంగం“. ఎట్టకేలకు ఈ చిత్రం రిలీజ్ డేట్ ప్రకటించింది. ఈ చిత్రం రిలీజ్ పోస్టుపోన్ అయిందని ఎన్నో రకాల పుకార్లు వస్తోన్న నేపథ్యంలో.. వాటన్నిటీకీ చెక్ పెడుతూ.. చిత్ర బృందం ఆగస్టు 15న రిలీజ్ డేట్ని కన్ఫర్మ్ చేసింది. కాజల్, హలో ఫేమ్ కల్యాణి ప్రియదర్శని ఈ చిత్రంలో అందాలు, సుధీర్ వర్మ టేకింగ్, సినిమాకి ప్లస్ కానున్నాయి. ఇక కదాబాలమున్న చిత్రాలనే సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తూ వస్తోంది.. శర్వానంద్ లుక్స్, గెటప్స్ చాలా డిఫరెంట్ గా ఉంది.. మాసివ్ క్యారెక్టర్లో శర్వానంద్ నటించినట్లు తెలుస్తోంది!!

తెలుగు చలన చిత్రపరిశ్రమలోని ప్రతిభావంతమైన నటుల్లో హీరో శర్వానంద్ ఒకరు. ‘గ్యాంగ్ స్టర్’ గా ఈ చిత్రం లో శర్వానంద్ పోషిస్తున్న పాత్ర ఆయన గత చిత్రాలకు భిన్నం గా ఉండటమే కాకుండా, ఎంతో వైవిద్యంగానూ, ఎమోషన్స్ తో కూడినదై ఉంటుంది. ‘గ్యాంగ్ స్టర్‘ అయిన చిత్ర కథానాయకుని జీవితంలో 1990 మరియు 2000 సంవత్సరాలలో జరిగిన సంఘటనల సమాహారమే ఈ ‘రణరంగం’.భిన్నమైన భావోద్వేగాలు,కధ, కధనాలు ఈ చిత్రం సొంతం. మా హీరో శర్వానంద్ ‘గ్యాంగ్ స్టర్’ పాత్రలో చక్కని ప్రతిభ కనబరిచారు. చిత్రం పై మాకెంతో నమ్మకం ఉంది. ప్రేక్షకులు కూడా ఈ నూతన ‘గ్యాంగ్ స్టర్’ చిత్రాన్ని ఆదరిస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

- Advertisement -

ఈ చిత్రానికి మాటలు: అర్జున్ – కార్తీక్, సంగీతం : ప్రశాంత్ పిళ్ళై , ఛాయాగ్రహణం :దివాకర్ మణి, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కృష్ణ చైతన్య,ఎడిటర్: నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, పోరాటాలు:వెంకట్, నృత్యాలు: బృంద, శోభి,శేఖర్, ప్రొడక్షన్ కంట్రోలర్: సి.హెచ్. రామకృష్ణారెడ్డి,
సమర్పణ: పి.డి.వి.ప్రసాద్.
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
రచన-దర్శకత్వం: సుధీర్ వర్మ

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All