Homeటాప్ స్టోరీస్రానా ఉన్నవి తేల్చకుండా కొత్తవి ఏంటి?

రానా ఉన్నవి తేల్చకుండా కొత్తవి ఏంటి?

రానా ఉన్నవి తేల్చకుండా కొత్తవి ఏంటి?
రానా ఉన్నవి తేల్చకుండా కొత్తవి ఏంటి?

రానా ఇంకా హైదరాబాద్ కి దూరంగానే ఉంటున్నాడు. షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చిన రానా యూఎస్ వెళ్లి ఏదో ఆరోగ్య సమస్యకు ట్రీట్మెంట్ చేయించుకున్నాడన్న విషయం అందరికీ తెల్సింది. అయితే తాను మామూలుగానే అక్కడికి వెళ్లానని రానా ఎంత కవరింగ్ చేసినా తనని చూసిన వాళ్ళెవరైనా ఏదో జరిగిందని మాత్రం చెప్పగలరు. యూఎస్ నుండి తిరిగి వచ్చాక కూడా రానా హైదరాబాద్ కు రాకుండా ముంబై వెళ్లడం పలు సందేహాలను రేకెత్తిస్తోంది.

అయితే ఈ పరిణామాల వల్ల రానా సినిమాల షూటింగ్ లు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. విరాటపర్వం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోవాల్సి ఉంది కానీ రానా వల్ల ఆలస్యమైంది. మరో సినిమా హాథీ మేరీ సాథీ.. మూడు భాషల్లో విడుదల కావాల్సిన భారీ ప్రాజెక్ట్. ప్రభు సల్మాన్ రూపొందిస్తున్న ఈ చిత్రం కూడా రానా కోసం ఎదురుచూస్తోంది.

- Advertisement -

ఇవే కాకుండా రానా ఓకే చెప్పిన గుణశేఖర్ ప్రాజెక్ట్ హిరణ్యకశ్యప ఉండనే ఉంది. ఇంకా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం రానా ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ పూర్తి చేసుకుని వస్తే మొదలుపెడదామని చూస్తోంది. వీటి పరిస్థితే ఇలా ఉంటే.. రానా మరో ప్రాజెక్ట్ ను ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఒక కొరియన్ మూవీను తెలుగు, తమిళ్ భాషల్లో రీమేక్ చేయాలని భావించి రైట్స్ కొనుగోలు చేసారు సురేష్ ప్రొడక్షన్స్. ఈ చిత్రంలో రానా హీరోగా, నయనతార హీరోయిన్ గా నటించనున్నారు. ఉన్న సినిమాలు రానా ఎప్పుడు పూర్తి చేస్తాడో ఈ సినిమాను ఎప్పుడు మొదలుపెడతాడో రానాకే తెలియాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All