Homeటాప్ స్టోరీస్రానా మీద ట్రోల్స్.. అదిరిపోయే రిప్లై

రానా మీద ట్రోల్స్.. అదిరిపోయే రిప్లై

రానా మీద ట్రోల్స్.. అదిరిపోయే రిప్లై
రానా మీద ట్రోల్స్.. అదిరిపోయే రిప్లై

రానా దగ్గుబాటి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు. తన చుట్టూ జరిగే విషయాల్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాడు. అంతే కాకుండా స్పదించడంలో కూడా రానా ఏ మాత్రం సంశయించడు. తనపై వస్తున్న వార్తలనే కాక తనకు నచ్చిన వార్తలను లైక్ చేయడం, రీట్వీట్ చేయడం లాంటివి చేస్తుంటాడు. గతేడాది అనారోగ్య కారణాలతో చాలా కాలం సినిమాలకు దూరంగా గడపాల్సి వచ్చిన రానా దగ్గుబాటి చివరికి సినిమాల్లోకి తిరిగి వచ్చాడు. ఎప్పటినుండో రిలీజ్ కాకుండా ఆగిపోయిన హాథీ మేరీ సాథీ సినిమా ఏప్రిల్ 2న విడుదల కానుందని ప్రకటించాడు.

ఇది పక్కన పెడితే నెపోటిజం అన్నది ఏ ఇండస్ట్రీలోనైనా ఉండేదే. దీని గురించి ఇప్పటికే చాలా కాలంగా డిబేట్లు నడుస్తున్నాయి. ఇండస్ట్రీలో తమ వాళ్ళు ఉండబట్టే ఇప్పటికీ కొందరు టాలెంట్ లేకపోయినా నెట్టుకుంటూ వస్తున్నారని, ఇండస్ట్రీలో బ్యాకింగ్ ఉంటేనే నెగ్గుకురాగలమని ఒక వర్గం వాళ్ళు వాదిస్తుంటే, ఎంత బ్యాకింగ్ ఉన్నా ఇక్కడ ఎంట్రీ వరకే ఉపయోగపడుతుందని, తర్వాత ఎవరి టాలెంట్ మీద వాళ్ళు నెగ్గుకురావాల్సిందేనని ఇండస్ట్రీ వాళ్ళు అభిప్రాయపడుతుంటారు. వీళ్ళ వాదనకు బలం చేకూర్చేలా ఇండస్ట్రీ బ్యాకింగ్ ఉండి ఫెయిల్ అయిన వాళ్ళ లిస్ట్ పెద్దదే ఉంటుంది.

- Advertisement -

ఇక రీసెంట్ గా సోషల్ మీడియాలో రానా ఇంటర్వ్యూ పేపర్ కటింగ్ ఒకటి హల్చల్ చేసింది. తాను పదో తరగతి కూడా పాస్ అవ్వలేదని అయితే తాను సాధించాలన్న దానికి అది ఏ మాత్రం అడ్డంకి కాలేదన్న రీతిలో ఆ పేపర్ కటింగ్ ఉంది. దానికి ఒక నెటిజన్ స్పందిస్తూ, రానా వెనుక పెద్ద స్టూడియో ఉంది కాబట్టే ఇది సాధ్యమైందని లేకపోతే పదో తరగతి పాస్ అవ్వనివాడు ఇలా నెగ్గుకురాలేడని కొంచెం వల్గర్ భాషలోనే స్పందించాడు.

దీన్ని రానా చూసీ చూడనట్లు వదిలేయొచ్చు. కానీ స్పందించాడు. ఇండస్ట్రీలో అనే కాదు ఏ పనిలో అయినా నైపుణ్యం లేకపోతే ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా వృథానే. దేశంలో ఎన్నో స్టూడియోలు తెరమరుగైన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాడు. టాలెంట్ ఉండి, కష్టపడుతున్న కారణంగానే తాను ఇప్పటికీ నెగ్గుకురాగలుగుతున్నానని చెప్పకనే చెప్పాడు రానా.

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All